రుణమాఫీ చర్చకు సిద్ధమా?సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
తెలంగాణలో రుణమాఫీపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రచ్చ జరుగుతోంది. రాష్ట్రంలో అర్హులైన రైతులం దరికీ ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన గడువులోపు రుణ మాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
గడువులోపు కాంగ్రెస్ ప్రభు త్వం రుణమాఫీ పూర్తిచేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు సవాల్ చేశాడని, వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు సిద్ధిపేటలో అర్థరాత్రి ప్లెక్సీలు సైతం వెలిశాయి. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఆందోళనతో సిద్ధిపేట లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ మేరకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ..
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. 46శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగిందని, 54శాతం రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు.
పూర్తిస్థాయిలో రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతుంది. రుణమాఫీ పూర్తయిందని ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రూ. 31వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి.. రూ. 17వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేయడం ఏమిటని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
ఏ రకంగా రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. ఇంకా 54శాతం మంది రైతులకు రుణమాఫీ చేయలేదని హరీశ్ రావు అన్నారు. రూ.14వేల కోట్లు కోతపెట్టారని విమర్శిం చారు.
సీఎం రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. ప్లేస్, డేట్, టైమ్ రేవంత్ రెడ్డి చెప్పాలి.. తెలంగాణలో ఎక్కడికైనా వెళ్లి రైతులను అడుగుదాం. రుణమాఫీ పూర్తిగా అయ్యిందో లేదో రైతులే చెబుతారని హరీశ్ రావు అన్నారు.