భరణంగా రూ.6 లక్షలు కోరిన భార్య.. మీరే సంపాదించుకోమన్న జడ్జి
సాధారణంగా భారతదేశంలో భర్త నుంచి విడాకులు తీసుకున్నాక మహిళలకు కొన్ని హక్కులుంటాయి. వీటి ద్వారా మాజీ భర్త ఆస్తిని ఆమె అడగవచ్చు. ఆర్థిక సాయంగా భరణం పొందవచ్చు.
ఈ క్రమంలోనే ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరుతూ భరణం కావాలని కోర్టు మెట్లు ఎక్కింది.అయితే ఒకటి కాదు రెండు కాదు తన భర్త నుంచి నెలవారీ భరణం రూ.6 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో జడ్జి ముందు డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
ఓ దంపతులు తమకు విడాకులు కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ సందర్భంగా సదరు వివాహిత.. తన భర్త నుంచి నెలకు భరణంగా రూ. 6.16 లక్షలు ఇప్పించాలంటూ న్యాయమూర్తిని కోరారు.
మోకాలినొప్పికి ఫిజియో థెరపీ చేయించుకునేందుకు నెలకు రూ.4 నుంచి 5 లక్షలు, దుస్తులు, షూలకు రూ.15 వేలు, ఇంట్లో భోజనానికి రూ.60 వేలు, హోటల్‌లో భోజనానికి వెళితే మరికొంత ఖర్చు అవుతుందని మొత్తం లెక్కలు చెప్పింది.అవన్నీ విలాసవంతమైన ఖర్చులు
అయితే వివాహిత డిమాండ్‌లు విన్న మహిళా జడ్జి షాక్‌కు గురైంది. ఒక్క మహిళకు నెలకు రూ. 6 లక్షలు ఎక్కువ అని, అవన్నీ విలాసవంతమైన ఖర్చులని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎవరైనా ఇంత ఖర్చు చేస్తారా? మీరు మీ కోసం అంత మొత్తం ఖర్చు చేయాలనుకుంటే మీరు సంపాదించుకోండి. భర్త నుంచి కోరడం కాదు. మీకు వేరే బాధ్యతలు లేవు. పిల్లలను చూసుకునే పని లేదు.
ఇవన్నీ మీకోసం మాత్రమే అడుగుతున్నారు. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 24 ఉద్దేశం ఇది కాదు. భర్తతో గొడవల కారణంగా విడాకులు అడుగుతున్నారు. కానీ రూ. 6,16,000 అడగటం సరి కాదు. మీ కారణాలు సహేతుకంగా ఉండాలి. భర్తకు ఇది శిక్ష కాకూడదు.’ అంటూ మహిళను హెచ్చరించింది. భర్త నుంచి ఆరు లక్షలు ఇప్పించేందు న్యాయమూర్తి నిరాకరించారు. వాస్తవ ఖర్చులతో మళ్లీ కోర్టుకు రావాలని తెలిపారు.