MuluguPoliticalTelangana

అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

దొరికిన మద్యం సీసాలు, కారు సీజ్

సీకే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
ములుగు జిల్లా వాజేడు మండలం మండపాక గ్రామంలో 24 వ తారీకు సాయంత్రం వాజేడు ఎస్సై -2 ఇమ్మానుయేల్ పెట్రోలింగ్ చేయుచుండగా పోలీస్ వారిని చూసి కారులో పారిపోతున్న అనుమానం వచ్చి వెంబడించిన పోలీసులు ఆ కారును అదుపులోకి తీసుకున్నారు.

టాటా జస్ట్ కారు నెంబర్ టీఎస్ 03ఈబి3600 కారుని తనిఖీ చేయగా అందులో ఎటువంటి అనుమతి లేకుండా మద్యం సీసాలు లభించాయి. వెంటనే పోలీస్ వారు పంచుల సమక్షంలో కారును సీజ్ చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

మద్యం తరలిస్తున్న వ్యక్తి పేరు తేజ, శంకర్ రాజు పల్లి గ్రామం ఎటునాగారం మండలం పైన కేసు నమోదు చేయడం జరిగింది.ఈ పెట్రోలింగ్లో వాజేడు ఎస్సై- 2 సివిల్ మరియు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button