సిన్సియర్గా లవ్ చేసి మోసపోయా.. నా డెడ్ బాడీని నా లవర్కు చూపించండి
Social media : సూసైడ్ లెటర్ రాసి.. వీడియో తీసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని కర్నూల్ టౌన్ లో జరిగింది.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జులకల్ స్టేజీకి చెందిన చంద్రకళ, దేవేంద్ర దంపతుల కొడుకు అశోక్(25). అతను ఎనిమిదేండ్లుగా ఐజ పట్టణానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇది తెలిసిన యువతి పేరెంట్స్ ఆమెకు ఇటీవల వేరే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేశారు.
ప్రియురాలు దక్కదని తెలిసిన అశోక్ మంగళవారం కర్నూలు టౌన్ కు వెళ్లి జేఆర్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. ముందుగా సూసైడ్ లెటర్ రాసి.. వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
‘ఆ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశా. ఆమె తండ్రి కానిస్టేబుల్ కావడంతో చాలా ఇబ్బందులు పెట్టాడు. నన్ను చంపాలని ప్రయత్నించాడు. నా చావుకు కారణమైన వారిని ఎవరినీ వదలొద్దు.
నేను చనిపోయాక బాడీని నా లవర్ కి చూపెట్టండి.’ అంటూ మృతుడు సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. బుధవారం సాయంత్రం యువకుడి డెడ్ బాడీతో కుటుంబసభ్యులు జులకల్ స్టేజీ వద్ద ధర్నా చేశారు.
యువతి కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయం చేసే వరకు కదిలేది లేదని బైఠాయించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవిబాబు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.