ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేపట్టిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగే
సి కే న్యూస్ (సంపత్) సెప్టెంబర్ 06
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే ఆకస్మిక తనిఖీ చేశారు.
ఆసుపత్రిని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శిస్తూ ఆస్పత్రిలో అవసరమయ్యే సౌకర్యాలు లేనప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యం పై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ప్రజలకు,రోగులకు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాన్నారు.
ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్నారు,ప్రస్తుతం డయాలసిస్ కేంద్రంలో ఉన్న బెడ్ల కంటే ఎక్కువ బెడ్లను ఏర్పాటు కు కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో అవసరమయ్యే మెడిసిన్ ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని,ల్యాబ్,ఎక్స్ రే,మెడిసిన్,కావాల్సిన స్టాఫ్ కి సంబంధించిన వివరాలను అందించాలన్నారు.