80లక్షల విలువగల 256 కేజీల గంజాయి స్వాధీనం.
కారు, ద్విచక్ర వాహనం సీజ్ ఇద్దరు అరెస్ట్
కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
సెప్టెంబర్ 08,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో సీసీఎస్ పోలీసులు, జూలూరుపాడు పోలీసులు సంయుక్తంగా చేపట్టిన వాహన తనిఖీల్లో కారులో తరలిస్తున్న 80 లక్షల విలువ కలిగిన 256 కేజీల గంజాయిని తరలిస్తున్న కారు, ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్ విలేకరులకు వెల్లడించారు.
కారులో హైదరాబాదుకు గంజాయిని తరలిస్తున్న శివశంకర్ రెడ్డి, నాగేంద్రబాబు లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామని తెలిపారు. గంజాయి విలువ సుమారు 80 లక్షల వరకు ఉంటుందని, నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
గంజాయిని పట్టుకున్న జూలూరుపాడు ఎస్సై రాణా ప్రతాప్, టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్, ఎస్ఐ ప్రవీణ్ లను ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారని తెలిపారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయిని అమ్మినా, అమ్మడానికి సహకరించినా, ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. సమావేశంలో సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ ఐ రాణా ప్రతాప్, సిబ్బంది పాల్గొన్నారు