మంత్రి శ్రీనివాసరెడ్డి మా మొర ఆలకించండి మహాప్రభో.
సిపిఐ నేత మారిశెట్టి వెంకటేశ్వరరావు!!
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి గ్రామంలోని కర్నాటి క్రిష్ణయ్య నగర్ కాలనీలో సిమెంట్ రోడ్డు లేక పోవడం వలన కాలనీ లోని పిల్లలు, వృద్ధులు, మహిళలు రోడ్డు మీద నడవలేని స్థితిలో ఉందని నేలకొండపల్లి మండల సిపిఐ సహాయ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. రోడ్డు వరినాట్లు పెట్టటానికి గొర్రు తోలి సిద్ధంగా ఉన్నట్లు తయారు అయిందని అన్నారు.
మా కాలనికి రోడ్డు కావాలని గతంలో మంత్రి కి మెమోరండం కూడా ఇచ్చియున్నాము. కనీసం మోటార్ సైకిల్ కూడా నడవడం లేదని అన్నారు. మండల అధికారులు, మంత్రి కలుగజేసుకుని మాకు సిమెంట్ రోడ్డు మంజూరు చేయించగలరని కోరుతున్నాము.
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకుమాని మల్లీకార్జన్, బిసి నాయకులు గుడిమెట్ల శ్రీనువాసరావు, బడుగు మాధవరావు,ఈడబోయిన వెంకన్న, దొండా వెంకన్న, గుగులోతు స్వామినాయక్,భూక్యా బాలాజి, మహిళలు మారిశెట్టి విజయదుర్గ, రమణమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.