మద్యం మత్తులో వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారం
ఏపీలో దారుణం జరిగింది. ఒంటరి వృద్ధురాలిపై మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డారు ముగ్గురు అగంతకులు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో మండలంలో శనివారం చోటుచేసుకుంది..
ప్రస్తుతం బాధితురాలు విషమ పరిస్థితిలో ఆస్పత్రి చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
మార్కాపురం మండలం వడ్డెర కాలనీలో చెందిన బాధిత వృద్ధురాలు ఇంట్లోవాళ్లు బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉంది. అతి తెలిసి ముగ్గురు యువకులు మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో బాధిత వృద్ధురాలి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఆమెతో ఆస్పత్రికి చేర్పించారు. ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు..