సవాళ్ల పర్వం.. కౌశిక్‌రెడ్డి, అరికెపూడి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ కౌశిక్‌రెడ్డి మాట్లాడారు.కౌశిక్ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉదయం 11 గంటలకు తన ఇంటికి కౌశిక్‌రెడ్డి రాకపోతే తానే కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ చేశారు.
దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల నివాసాల దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక పాడి కౌశిక్‌రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
పీఏసీ కమిటీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై కౌశిక్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.
కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్‌కు రావాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నాడు
కాబట్టి రేపు అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా.. ఇద్దరం కలిసి మీ ఇంటి మీద జెండా ఎగరేసి, BRS భవన్ లో ప్రెస్ మీట్ పెడదాం అని కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే దీనికి అరికెపూడి గాంధీ అంతేతీవ్రంగా ప్రతిస్పందించారు.