సాయి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విరాళం
పలమనేరు సెప్టెంబర్ 12 సీకే న్యూస్
విజయవాడలో సంభవించిన వరద బీభత్సం వలన ఇబ్బందులు పడుతున్న వరద బాధితుల సహాయార్థం, పలమనేరు సాయి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం
కలిసి సేకరించిన ఒక లక్ష 50 వేల రూపాయల విరాళాన్ని, ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపాలని కోరుతూ చెక్కును ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి కళాశాల యజమాన్యం గురువారం అందజేసింది.
ఈ సందర్బంగా కళాశాల యాజమాన్య సభ్యులు ఎం వి ఆర్ రెడ్డి, ప్రమోద్, కిషోర్ లను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.