తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా పాలన పేరుతో ప్రతిష్టాత్మకంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ మేరకు 28న తేదీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.
వాస్తవానికి డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే..తాజాగా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి కాస్తా బ్రేక్ పడింది. అసలు దరఖాస్తుల స్వీకరణకు ఎందుకని బ్రేక్ పడింది? ఆప్లికేషన్లు ఎందుకు తీసుకోవడం లేదు? అనేది తెలుసుకుందాం.
31వ తేదీ (ఆదివారం), 1వ తేదీ (సోమవారం) రెండు రోజుల పాటు దరఖాస్తులకు ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. తిరిగి 02వ తేదీ నుంచి 06 వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 28వ తేదీన ప్రజాపాలన ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.
ప్రస్తుతం ప్రజలు దరఖాస్తుల గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యాంరటీల లబ్ధిదారుల ఎంపికంలో భాగంగా ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.
రేవంత్ సర్కార్ ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు పోటేత్తుతున్నాయి. అయితే.. ఇంతటీ విశేష స్పందన వస్తున్న ఈ కార్యక్రమానికి రెండు రోజుల పాటు ప్రభుత్వం బ్రేక్ ఇచ్చింది.
నేడు (డిసెంబర్ 31) ఆదివారం సెలవు కాగా.. సోమవారం (జనవరి 1) కొత్త సంవత్సరం కావటంతో ఈ రెండు రోజులు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. దీంతో ఈ రెండు రోజులు ప్రజాపాలన దరఖాస్తులకు బ్రేక్ పడింది.
తిరిగి ఈ కార్యక్రమం జనవరి 02వ తేదీ నుంచి 06 వ తేదీ వరకు కొనసాగనుంది. అంటే..2 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు ప్రజాపాలన కౌంటర్లల్లో యథావిధిగా దరఖాస్తులు తీసుకుంటారన్న మాట. ఇప్పటికే.. గ్రామ, వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తుతుండటంతో భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి.
కొద్ది రోజులే సమయం ఉండటంతో చాలా ప్రాంతాల్లో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. అనవసరంగా దరఖాస్తుల అందజేత కోసం.. గ్రామ, వార్డు సభలకు చూట్టు తిరిగి సమయం వృథా చేసుకోవద్దని సూచిస్తున్నారు అధికారులు.