ఫుల్లుగా తాగి గణేశుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ
వికారాబాద్ జిల్లాలో ఫుల్లుగా తాగిన ఓ పోలీసు అధికారి గణేశుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
పూడూర్ మండల కేంద్రం గణేషుడి నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్సీ కాలనీలోని గణేషుడి విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు.
హిందూ ధర్మన్ని, దేవుణ్ణి అవమానించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.