అసలు వ్యక్తి కి బదులు నకిలీ వ్యక్తి పరీక్ష రాసిన కేసులో యువతికి జైలు శిక్ష జరిమానా.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
సెప్టెంబర్ 17,
అసలుకు బదులు నకిలీ వ్యక్తి 10వ తరగతి పరీక్షలు వ్రాసిన కేసులో యువతికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే సాయి శ్రీ మంగళవారం తీర్పు చెప్పారు.
కొత్తగూడెం పట్టణానికి చెందిన నీరు కొండ షాహాజీ బాబు చీప్ పరీక్షల విభాగం పదవ తరగతి రాంనగర్ కు చెందిన ఎస్ఆర్ డిజిటల్ స్కూలు సెంటర్ నందు ఇన్స్పెక్షన్ చేయు చుండగా బానోతు రమేష్ ఇన్విజిలెటర్ కు అనుమానం రాగా పరిశీలించు చుండగా రూమ్ నెంబరు 19 నందు రాచాబంటి శేషమణి కి బదులు ఈ . అనూష అనే మైనరు పరీక్ష వ్రాయచుండగా అనుమానం వచ్చి విచారించగా దొరికిపోయి నిజము ఒప్పుకున్నదని శేషమణి కి సంబంధించిన హాల్ టికెట్, ఆన్సర్ షీట్ లు జతచేసి బానోతు రమేష్ చీప్ సూపర్నెంట్ ఆఫ్ పరీక్షల విభాగం చీఫ్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేయగా ఆయన విచారించ గా నేరము ఒప్పుకున్నదని వన్ టౌన్ కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ వారికి 2016 మార్చి 31న నీరుకొండ షాహాజీ బాబు ఫిర్యాదు చేయగా అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తునానంతరం కోర్టులో ఛార్జింగ్ దాఖలు చేశారు.
ఐదుగురు సాక్షుల విచారణ అనంతరము రాచబంటి శేషమణి పై నేరం రుజువు కాగా ఏపీ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ మరియు అన్ ఫెయిర్ మీన్స్ యాక్ట్ ప్రకారము మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఐదువేల రూపాయల జరిమానా, సెక్షన్ 419 ఐపీసీ ప్రకారం ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
ప్రాస్క్యూషన్ ను విశ్వశాంతి నిర్వహించారు. కోర్టు లైజాన్ ఆఫీసర్ మహమ్మద్ అబ్దుల్ ఘని ( కోర్టు డ్యూటీ ఆఫీసర్) చుంచుపల్లి కోర్టు పిసి రామకృష్ణ లు సహకరించారు.