డెకాయిటీ కేసులో 5 గురు దొంగల అరెస్ట్.
కేసులో కీలక సంచారం ఇచ్చిన అటో డ్రైవర్ కు సన్మానం చేసిన
ఎస్పి సన్ ప్రీత్ సింగ్
మేళ్లచెరువు PS పరిధి డెకాయిటీ దొంగతనం కేసును ఛేదించిన కోదాడ రూరల్ సర్కిల్ పోలీసులు
మొత్తం రూ.6 లక్షల 38 వేల విలువ సీజ్
5 గురు నింధితులను రిమాండ్ కు తరలింపు
A6 పరారీలో ఉన్నాడు.
సైంటిఫిక్ ఆధారలతో కేసును ఛేదించిన పోలీస్
నేరాల నియంత్రణ, శాంతి భద్రతల రక్షణలో పౌరులు భగస్వామ్యం కావాలి.
సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా.
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య సెప్టెంబర్ 24
జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఇలాంటి కేసులు గత కొన్ని సంవత్సరాలుగా నమోదు కావడం లేదు,
ఈ కేసుకు సంభందిని సైంటిఫిక్ ఆధారాలతో ముందుకు వెళ్ళి వేగంగా నింధితులను గుర్తించి కేసు ఛేదించడం జరిగినది అని భాగా పని చేసిన సిబ్బంది అందరికి ఎస్పీ ప్రశంషా పత్రాలు అందించి అభినందించడం జరిగినది. ఈ కేసు చెదనలో కోదాడ సబ్ డివిజన్ పోలీసులతో 7 బృందాలు ఏర్పాటు చేయడం జరిగినది అని ఎస్పి తెలిపారు
కేసు వివరాలు
మేళ్లచెరువు శివారు వెల్లటూరు కాలనీ గ్రామం నందు 19వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఐదుగురు దొంగలు తమ్మిశెట్టి వెంకయ్య అనే బ్రిక్స్ వ్యాపారి ఇంట్లో తల్లుపు ఇనుప ప్లేట్ కట్ చేసి బలంగా పగలగొట్టి అక్రమంగా ప్రవేశించి వారి వద్ద ఉన్న ఆయుధాలతో వెంకయ్యను మరియు ఇద్దరు కూతుర్లను బెదిరించి వారిపై ఉన్న 6.5 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.50వే ల రూపాయల డబ్బు దొంగతనం చేసినారు.
దీనిపై ఇంటి యజమాని తమ్మిషెట్టి వెంకయ్య ఫిర్యాదు మేరకు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ నందు నేరం సంఖ్య 165/2024, సెక్షన్ 310(2), 333, 127(2) భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం డేకాయిటి దొంగతనం కేసు నమోదు చేసి విచారణ చేయడం జరిగినది. జిల్లా ఎస్పీ, అధనపు ఎస్పీ, కోదాడ డిఎస్‌పి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
దొంగల కోసం అధనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ డివిజన్ డి.ఎస్ పీ శ్రీధర్ రెడ్డి, ఆద్వర్యంలో 7 పోలీసు బృందాలు ఏర్పాటు చేయడం జరిగినది. కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, తన సిబ్బందితో అనంతగిరి పోలీసు స్టేషన్ పరిధిలో ఖమ్మం వెళ్ళే జాతీయ రహదారి 365 పై శాంతినగర్ వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేయుచుండగా అనుమానంగా వస్తున్న ఇన్నోవా కారును గుర్తించి తనిఖీ చేసి కారులో కూర్చున్న 5 గురు వ్యక్తుల ను గుర్తిచారు,
వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన A1 వేమవరపు నాగరాజు, A3 వేమవరపు పుల్లారావు, A4 బిక్షాలు, నల్గొండ జిల్లాకు చెందిన A2 రమావత్ మాత్రు, నాగూర్ కర్నూల్ జిల్లాకు చెందిన A5 చిక్కల అంజనేయు లను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది.
విచారణ లో భాగంగా వీరు మేళ్లచెరువు శివారు వెల్లటూరు గ్రామంలో బ్రిక్స్ వ్యాపారి ఇంట్లో కత్తులతో బెదిరించి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించడం జరిగినది. వీరి నుండి రూ.1,62,250/- రూపాయల విలువగల 6.5 తులాల బంగారం అభరణాలు,రూ.12000/- వేయిల విలువగల 30 తులాల వెండి, రూ.38250/- రూపాయల డబ్బు, నేరానికి ఉపయోగించిన రూ.3,50,000/- విలువగల ఇన్నోవా కారు,రూ.75,000/- విలువ 5 మొబైల్స్,దొంగతనానికి ఉపయోగించిన 5 కత్తులు, 2 జతల చేతి గ్లౌజులు, మాస్క్ లు సీజ్ చేయడం జరిగినది.
A1 నాగరాజుకు మల్లారెడ్డిగూడెం లో బంధువులు ఉన్నారు. నాగరాజు గతంలో మల్లారెడ్డిగూడెంలో భందువుల పెళ్లికి వచ్చివెళ్ళేటప్పుడు మార్గం మద్యలో మేళ్లచెరువు నందు కోళ్ళు అమ్ముతున్న A6 వేముల వెంకటేశ్వర్లు (మిర్చి విత్తనాల వ్యాపారి) వద్ద కోళ్ళు కొనే సమయంలో పరిచయంఏర్పడి ఇద్దరు స్నేహితులయ్యారు, A1 నాగరాజు డ్రైవర్ కావడం వల్ల వ్యాపారం గురించి వెంకటేశ్వర్లుతో మాట్లాడేవాడు.
నాగరాజుకు డబ్బు అవసరం ఉన్నందున విషయాన్ని A6 వెంకటేశ్వర్లుకు తెలుపి ఏదైనా దొంగతనానికి పాల్పడాలని నిశ్చయించుకుని, సహాయం చేయాలని వెంకటేశ్వర్లుని అడగగా మేళ్లచెరువు శివారు వెల్లటూరు గ్రామంలో ఉన్న బ్రిక్స్ వ్యాపారి తమ్మిశెట్టి వెంకయ్య ఇంట్లో దొంగతనం చేస్తే 30 లక్షల వరకు డబ్బు దొరుకుతుందని తెలిపినాడు.
పథకం ప్రకారం A6 వెంకటేశ్వర్లు చెప్పిన విధంగా నింధితులు ఐదుగురు A2 రమావత్ మాత్రు తన స్నేహితుని వద్ద తెచ్చిన ఇన్నోవా కారులో వచ్చి బ్రిక్స్ వ్యాపారి తమ్మిశెట్టి వెంకయ్య ఇంటి తలుపుకు ఉన్న ఇనుప రేకు తొలగించి, బలంగా పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో నిద్రిస్తున్న వెంకయ్యను, అతని ఇద్దరి కూతుళ్లను కత్తులతో బెదిరించి 6.5 తులాల భంగారం, 30 తులాల వెండి, 50 వేల రూపాయల డబ్బు దొంగిలించారు.
ఇంట్లో వారు ఇవ్వరికీ సమాచారం ఇవ్వకుండా ముందుగా ఇంట్లో వారి 4 మొబైల్స్ ను తీసుకుని, దొంగతనం పూర్తి అయినాకా ఇంటి బయట పడేసి వెళ్ళినారు. దొంగతనం చేసి వెళ్ళేటప్పుడు ఇంటి బయట నుండి డోర్ కు బేడెం పెట్టి వెళ్ళినారు.
ఇంట్లో వారు వెంకయ్య కూతురు ఇంట్లో ఉన్న మరో ఫోన్ తో పక్కింటి వారికి సమాచారం ఇవ్వగా వారు 100 కు ఫోన్ చేసి పోలీసులకు సంచారం ఇవ్వడం జరిగినది. కేసులో ఉపయోగించిన ఇన్నోవా కారు డిల్లీ రిజిస్ట్రేషన్ తో కూడినది, ఇది టోల్ ప్లాజా వద్ద కూడా గుర్తించడం జరిగినది.
ఈ కేసులో కీలక సమాచారం ఇచ్చిన సాదారణ పౌరుడు ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఈ కేసు చెదనలో చాలా ఉపయోగపడినది. ధైర్యంగా సమాచారం ఇచ్చిన ఆటో డ్రైవర్ ను ఎస్పీ అధికారుల సమక్షంలో సన్మానించారు. నేరాలకు సంభందించి పౌరుల బాద్యతగా సమాచారం ఇవ్వాలి, నేరాల నియంత్రణలో, శాంతి భద్రత ల రక్షణలో ప్రజల బగస్వామ్యం చాలా ముఖ్యమైనది అని ఎస్పీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన A1 వేమవరపు నాగరాజు, A2 వేమవరపు పుల్లారావు, A4 బిక్షాలు బందువులు. A2 రమావత్ మాతృ, A5 చిక్కల అంజనేయులు స్నేహితులు. A1 నాగరాజు, మెల్లచెరువు కు చెందిన A6 స్నేహితులు.
నింధితులపై గత నేర చరిత్ర :
నిందితులుA1 పై ఆంధ్రాలో కంచికలచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా కేసు, వీర్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం తరలింపు కేసు, ఖమ్మం జిల్లా మధిర టౌన్ లో దొంగతనం కేసులు ఉన్నాయి.నిందితుడుA2 పై రాచకొండ కమిషనరేట్ పరిధి మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనం కేసులు ఇబ్రహీంపట్నం ఉప్పల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క దొంగతనం కేసు నల్గొండ జిల్లా చింతపల్లి పరిధిలో రెండు దొంగతనం కేసులు మొత్తం ఏడు కేసులు ఉన్నాయి. కేసులో భాగా పని చేసిన అధనపు ఎస్పీ నాగేశ్వర రావు, కోదాడ డిఎస్‌పి శ్రీధర్ రెడ్డి, సిఐ రజిత రెడ్డి, మేళ్లచెరువు ఎస్సై పరమేష్, అనంతగిరి ఎస్సై నవీన్, కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి, చింతలపాలెం ఎస్సై సైది రెడ్డి, సిసిఎస్ సిబ్బందిని, ఐటీ సెల్ సిబ్బందిని, సబ్ డివిజన్ టెక్నికల్ టీం సిబ్బందిని ఎస్పీ అభినందినచి రివార్డ్స్ అందించారు. ఇట్టి విలేకరుల సమావేశంలో
ఎస్పీ తోపాటుగా జిల్లా అధనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ డిఎస్‌పి శ్రీధర్ రెడ్డి, కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, మేళ్ళచెరువు ఎస్సై పరమేష్, అనంతగిరి ఎస్సై నవీన్, కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి, టెక్నికల్ టీం సిబ్బంది ఉన్నారు.