సంచలనంగా నల్లగొండ జిల్లా పంచాయతీ సెక్రెటరీల నిర్ణయం
నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో
నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మండల అధికారులు,పంచాయతీ సెక్రెటరీల తో మాట్లాడటం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ గడ్డి కోత యంత్రాలు కొనక పోవడం అలాగే మొక్కలు పెంపకం,పారిశుద్ధ్యం, కంపోస్టు షెడ్ నిర్వహణ వంటి కారణాల వల్ల గుర్రంపోడు ఎంపీడీఓ పి.మంజులను అలాగే, విధులకు హాజరు కానీ పులిచెర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి కె నాగరాజు ను, ఉద్యోగం నుంచి తొలగించడం, పారిశుద్ధ్యం క్రిమిటోరియం నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వాచ్య తండా గ్రామ పంచాయతీ సెక్రటరీ కె.స్వప్న ని సస్పెండ్ చేశారు.దీనికి నిరసనగా వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఈ రోజు నల్లగొండ జిల్లా లోని 844 మంది గ్రామ పంచాయతీ సెక్రెటరీలు సెలవులు తీసుకుని నిరసన తెలిపారు.
వారిని విధులలోకి తీసుకునే వరకు సెలవులో ఉంటామని అవసరం అయితే పెన్ డౌన్ చేస్తామని అన్నారు.గ్రామ పంచాయతీ లకు నిర్వహణకు బడ్జెట్ సరి అయిన సమయానికి రాకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నట్లు తెలిపారు.అలాగే మండలాల్లో ఉన్న అధికారిక వాట్సప్ గ్రూపుల నుండి ఎవరికి వారు ఎక్సిట్ అవుతున్నారు అని సమాచారం. మరి ఇదే విషయమై కలెక్టర్ వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే. అలాగే వారికి గడ్డి యంత్రాలు,ఫాగ్ మిషన్లు కొనడానికి కూడా గ్రామ పంచాయతీ లలో బడ్జెట్ లేదు అని అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నామని వాపోతున్నారు.ఇప్పటికే గ్రామాలలో సర్పంచులు లేక నానా అవస్థలు పడుతున్నట్లు సమాచారం