నిజామాబాద్ జిల్లాలో దారుణం.. వియ్యంకుడిని నరికి చంపిన వ్యక్తి
ఓ వ్యక్తి పట్టపగలే దారుణ హత్యకు గురైన షాకింగ్ ఘటన నిజామాబాద్ జిల్లా మెపాల్ మండల పరిధిలోని కంజర గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కంజర గ్రామానికి చెందిన గోవర్ధన్, భవిత భార్యాభర్తలు. అయితే, ఇటీవలే కుటుంబ కలహాలతో భవిత ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ క్రమంలోనే తన కూతురుని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, అల్లుడు గోవర్ధన్ వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి సత్యనారాయణ లోలోల ద్వేషం పెంచుకున్నాడు.
గురువారం ఉదయం సత్యనారాయణ, భవిత అత్తగారింటిపైకి దాడి చేసేందుకు వెళ్లాడు.అక్కడ అల్లుడు గోవర్ధన్ కనిపించకపోవడంతో అడ్డుకునేందుకు వచ్చిన తండ్రి నరహరిని కత్తిలతో నరికి చంపేశాడు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సత్యనారాయణ కోసం గాలిస్తున్నారు.