రాను రాను సమాజం ఎటు పోతుందో తెలియడం లేదు.ముఖ్యంగా ఎక్కడ చూసిన ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యలు అంతకంతకి ఎక్కువైపోతున్నాయి. అయితే ఇంత వరకు మగవారి వల్లే ఆడవాళ్లకు రక్షణ లేదు అనుకున్నాం.
కానీ, ఇప్పుడు ఆడవారి వలనే తోటి ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది. ఒక రకంగా చెప్పాలంటే..ఒక ఆడదే మరో ఆడదానికి శత్రవుగా మారుతుంది. నమ్మించి తడి గుడ్డతో గోంతు కోస్తుంది. కనీసం కనికరం కూడా లేకుండా కొంతమంది మహిళలు.. పురుషులతో కలిసి మరో ఆడదాన్ని ప్రాణాలను బలికుంటున్న సంఘటనలు ఇటీవలే చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ తన కొడుకు చేసిన పనికి కాపలాగా కాయడమే కాకుండా.. ఊ హించని దారుణానికి ఒడిగట్టింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఈ నెల 14వ తేదీన జరిగిన ఓ యువతి హత్య కేసులో వీడని మిస్టరీని తాజాగా పోలీసులు చేధించారు. పెళ్లి చేసుకోవాలని ఓ యువతి నిలదీయడంతో ఆమె ప్రియుడే కుటుంబ సభ్యులతో దారుణంగా హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కాగా, హత్యకు ముందు ఆమెపై ప్రియుడితో పాటు అతడి బావ సైతం లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. అయితే ఈ దారుణమైన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి వివరాలను డీఎస్పీ రాజశేఖర రాజు బుధవారం మీడియాతో వెల్లడించారు. అయితే హత్య కేసులో డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు..దామరచర్ల మండలానికి చెందిన ఓ 19 ఏళ్ల యువతి, అదే మండలం పుట్టలగడ్డ తండాకు చెందిన రూపావత్ నాగు రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ఆ యువతి రెండు సార్లు ప్రెగ్నెంట్ కావడంతో ప్రియుడు బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు.
అయితే ఈ విషయం యువతి ఇంట్లోకాస్త తెలియడంతో ఇద్దరి పెళ్లి గురించి యువతీ తల్లిదండ్రులు ప్రియుడు నాగు ఇంటికి వెళ్లారు. కానీ, నాగుతో పాటు అతడి తల్లి ఈ పెళ్లికి నిరాకరించారు. ఇక ఈ విషయం తెలిసిన యువతి ఈ నెల 14న పుట్టలగడ్డ తండాలోని నాగు ఇంటికి వెళ్లి పెండ్లి విషయమై నిలదీసింది. దీంతో ఊర్లో పరువు పోయిందని భావించిన నాగు, అతడి తల్లి బుజ్జి, బావ రమావత్ క్రాంతి కలిసి యువతిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే.. మాట్లాడేందుకు తండాలోని మాలోతు దేశ్యాకు చెందిన వ్యవసాయ భూమి వద్దకు రావాలని యువతికి చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్లింది. కాగా, అక్కడ తల్లి బుజ్జి రోడ్డుపై కాపలా ఉండగా నాగుతో పాటు అతడి బావ క్రాంతి యువతిపై లైంగిక దాడి చేశారు.
అనంతరం ముగ్గురు కలిసి యవతి గొంతు నులిమి హత్య చేశారు. కానీ, అది హత్య కాదు, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడదీశారు. ఇక ఈ విషయంపై సమాచారం అందుకున్ పోలీసులు కేసు నమోదు కాగా ఎంక్వైరీ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు బైక్లు, సెల్ఫోన్లు, కండువాను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, వాడపల్లి ఎస్సై ఇరుగు రవిని డీఎస్పీ అభినందించారు. మరి ప్రేమ పేరుతో నయా వంచనకు పాల్పడి ప్రియురాలిని హత్య చేయడమే కాకుండా.. ఆ హత్యకు కన్న తల్లి కూడా సహకరించిన ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.