బాలికపై అత్యాచార యత్నం.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు
సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం పోక్సో కేసు నమోదయింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ బాలికతో బాబాయి వరుస అయ్యే షేక్ పాషా మియా బుధవారం సాయంత్రం అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో కుటుంబసభ్యులు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు షేక్ పాషా మియాపై పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పర్చినట్లు పోలీసులు తెలిపారు.