ఏసీబీ రైడ్స్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ప్రిన్సిపాల్..
హైదరాబాద్:-కొత్తపేట లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏసీబీ రైడ్స్.
ఫుడ్ కాంట్రాక్టుకు సంబంధించి 29,000/- రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ VM హోమ్ ప్రిన్సిపాల్ ప్రభు దాస్.
స్కూల్ కు సంబంధించిన ఫుడ్ కాంట్రాక్టు విషయం లో అవకతవకల పై పలు ఫిర్యాదులు రావడం తో VM హోమ్ స్కూల్ పై నిఘా ఏర్పాటు చేసిన ఏసీబీ అధికారులు.
VM హోమ్ లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.
ఫుడ్ కాంట్రాక్టు బిల్లు కు సంబందించి వాస్తవ బిల్లులు కన్న అధిక బిల్లులు సృష్టించి, అధిక మొత్తం బిల్లులకు సంబందించిన డబ్బులు 29,000/- వేలు కాంట్రాక్టర్ వద్ద నుండి తిరిగి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడిన కొత్తపేట లోని VM హోమ్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభు దాస్.
ప్రభుదాస్ ను అదుపులోకి తీసుకుని సంబంధించిన వివరాల పై ప్రిన్సిపల్ ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు.
పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.