కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
సీకే న్యూస్ మాడుగులపల్లి సెప్టెంబర్ 30
ఆదివారం ఉదయం 07:30గంటల సమయంలో చింతలగూడెం ఎచ్ ఓ కుక్కడం గ్రామంలోని లొడంగి గోవిందు తండ్రి సైదులు, వయస్సు 45 సంవత్సరాలు, కులం యాదవ, వృత్తి వ్యవసాయం అను అతను తన కొడుకు నరేష్ తో పాటు తన పొలం పనులకు వెళ్లి స్టార్టర్ కు వచ్చే కరెంటు సప్లై వైరు తెగిపోవడంతో దానిని కటింగ్ ప్లేయర్ తో సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి కింద పడిపోగా అట్టి విషయాన్ని అక్కడే ఉన్నటువంటి అతని కొడుకు తన తల్లి నాగలక్ష్మి కి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే గోవిందను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ పరిశీలించి గోవిందు కరెంట్ షాక్ వల్ల చనిపోయారు అని తెలియచేయడం జరిగింది.
ఇట్టి విషయంలో మృతుని భార్య లోడంగి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మాడుగులపల్లి ఎస్.ఐ ఎస్ కృష్ణయ్య తెలిపారు.