పంచాయతీ ఓటర్ల సంఖ్య కోటి 67లక్షల 33 వేల 585..!!
హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందుకోసం జిల్లా, గ్రామస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
33 జిల్లాల్లో 12,769 గ్రామాలుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు కొన్ని జిల్లాల్లో పంచాయతీలు, వార్డుల వారీగా ఫైనల్ ఓటర్ లిస్టులను ప్రదర్శిస్తున్నది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,67,33,585 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 13న వెల్లడించగా.. దానిపై అభ్యంతరాలు స్వీకరించి.. అన్నింటినీ పరిష్కరించి తుది జాబితాలు రూపొందించారు. కాగా, రాష్ట్ర ఎన్ని కల సంఘం ఓటరు జాబితా సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించ లేదు. నేడో, రేపో తుది ఓటరు జాబితా విడదల చేసే చాన్స్ ఉంది.
బ్యాలెట్ బాక్స్లు సిద్ధం..
పంచాయతీల ఎన్నికలకు క్షేత్రస్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా.. నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఎంత మంది పోలింగ్ సిబ్బంది అవసరం.. పోలింగ్ కేంద్రాల వివరాలు, ఆర్వో బుక్లు, బ్యాలెట్ బాక్స్లు రెడీ చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల కోసం మొత్తం 54,660 బ్యాలెట్ బాక్స్లు అవసరం కాగా.. రాష్ట్రంలో 40,260 బ్యాలెట్ బాక్స్లు ఉన్నాయి. కర్నాటక నుంచి 9,214, ఆంధ్రప్రదేశ్ నుంచి 9,088 తీసుకొచ్చారు. ప్రస్తుతం 58,562 బ్యాలెట్బాక్స్లు రెడీ గా ఉన్నాయి.
రిజర్వేషన్లపై ఉత్కం
కులగణన పూర్తి చేసిన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఈ మేరకు కుల గణనపై కసరత్తు ముమ్మరం చేసింది.
రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తే ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది. అయితే, ఇప్పటికే గ్రామాల్లో రిజర్వేషన్ల అంశంపై జోరుగా చర్చ నడుస్తుంది. అయితే, గ్రామాల్లో ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్వర్తిస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఒకవేళ తమ సామాజిక వర్గానికే రిజర్వేషన్ అయితే పోటీ చేసేందుకు ఆయా లీడర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు గెలిస్తే ప్రజలకు , గ్రామానికి ఏం చేస్తారో కూడా గ్రామంలో కలియతిరుగుతూ వివరిస్తున్నారు. కొంతమంది బాండ్పేపరు రాసి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే విడుదలైన ఓటర్ల జాబితా ప్రకారం పలు జిల్లాల్లో ఓటర్ల వివరాలు..
ఆదిలాబాద్ 4,41,795
భద్రాది కొత్తగూడెం 6,23,947
జగిత్యాల 5,93540
జోగులాంబ గద్వాల 3,88,195
కరీంనగర్ 5,27,237
ఖమ్మం 8,52,879
కుమ్రంభీం ఆసిఫాబాద్ 4,57,117
మెదక్ 5,12,277
నాగర్కర్నూల్ 6,46,407
నిర్మల్ 4,40,982
పెద్దపల్లి 4,07,716
రాజన్న సిరిసిల్ల 5,46,259
రంగారెడ్డి 7,94,651
సిద్దిపేట 6,14,371
వికారాబాద్ 6,71,940
వనపర్తి 3,56,752
వరంగల్ 3,89,052