రెడ్డి పరివార్ మహిళల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 02
మఠంపల్లి మండల కేంద్రంలో రెడ్డి పరివార్ మహిళల ఆధ్వర్యంలో బుధవారం వేణుగోపాలస్వామి ఆలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి తీరొక్క పులను పేర్చి ఆటపాటలతో అలరించారు.
మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి, గునుగు, తంగేడు, బంతి వంటి పూలతో బతుకమ్మను అంగరంగ వైభవంగా అలంకరించి .మహిళలు బతుకమ్మలను ఒక చోట చేర్చి చప్పట్లాట్లతో అందరూ భక్తి శ్రద్ధలతో ఘనంగా బతుకమ్మను జరుపుకున్నారు.
ఇట్టి కార్యక్రమంలో మన్నెం భారతమ్మ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ సంబరాలు నిదర్శనం అని అన్నారు.జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి పరివార్ సభ్యులు పాల్గొన్నారు.