మహాత్ముడి ఆశయాలతో ముందుకు సాగుదాం
మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నాయకులు శానంపూడి సైదిరెడ్డి
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 02
గాంధీ మహాత్ముడి ఆశయాలతో దేశ ప్రజలు ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకులు సానంపూడి సైదిరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఇట్టి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ
భారతప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకొని నేడు మహాత్మా గాంధీ జయంతి వరకు పలు సాంఘీక,సంక్షేమ స్వచ్చ కార్యక్రమాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో మాతా శిశు కేంద్రంలో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మహాత్మా గాంధీ ఆశయ సాధన లో భాగంగా స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని , దేశంలో మహాత్ముడు కలలు కన్న సామాజిక న్యాయం, శాంతి, సుస్థిర అభివృద్ధి అనేది బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుతున్నవని అన్నారు.
ప్రపంచంలో భారత్ ను అన్నిరంగాలలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృషిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డా. వర్షిత్ రెడ్డి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు గొలి మధుసూదన్ రెడ్డి చంద్రశేఖర్ సాంబయ్య నీరజ మరియు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, యువ, మహిళా నాయకులు పాల్గొన్నారు.