ఇంకా ఎన్ని రోజులు ఈ నరకప్రాయమైన మా జీవితాలు
పండుగ పూట కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం ఈడంపింగ్ యార్డు దుర్వాసన వాళ్ళ
స్థానిక ఎమ్మెల్యే తొందరగా స్పందించి మా సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకలు
షాద్ నగర్ మున్సిపాలిటీ కమిషనర్ తక్షణమే స్పందించి దుర్వాసన తగు చర్యలు చేపట్టాలి
TMRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోలిపూర్ గ్రామ నివాసి సింగపాగ జంగయ్య మాదిగ
షాద్ నగర్ మున్సిపాలిటీలోని సోలిపూర్ గ్రామ శివారులో గల డంపింగ్ యార్డ్ వల్ల దుర్వాసనతోటి ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఈ సమస్యపై సింగపాగ జంగయ్య మాదిగ మాట్లాడుతూ సోలిపూర్ 5 వ వార్డులో షాద్ నగర్ మున్సిపాలిటీలోని వివిధ వార్డులో నుండి వచ్చే చెత్తను రోజు రోడ్డు పైనే వేసి హిటాచి రోజు ఆనేక వ్యర్థాలతో భాగ కుళ్లిపోయిన పాత చెత్తను కదిలించడం వలన విపరీతమైన దుర్వాసన వస్తుంది
ఆనేక వ్యర్థాలతో భాగ కుళ్లిపోయిన పాత చెత్తను తీసేటప్పుడు దుర్వాసన రాకుండా అలాంటి రసాయన స్ప్రే చేయలేకపోవడం విపరీతమైన దుర్వాసన వస్తుంది ఒక్క షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుల చెత్తతో ఎక్కువగా యానికరమైన వ్యర్థాలు దుర్వాసనతో కూడిన వ్యర్థ పదార్థాలు కానీ షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కువగా ప్రవేట్ హాస్పిటల్స్ , హోటల్స్ , ఫంక్షన్ హాల్స్ , షాద్ నగర్ ప్రాంతం చుట్టు చిన్న చిన్న ఆనేక కుటీర పరిశ్రమల నుండి కాకుండ నందిగామ, కొత్తూర్, బాల్ నగర్, మండలలలో ఉన్న పరిశ్రమల నుండి ధాభాల నుండి రాత్రి పగలు అనేక వ్యర్థ పదార్థాలు వేయడం వల్లనే డంపింగ్ యార్డ్ లో దుర్వాసన అధికమైపోతుంది
కనుక పాత చెత్తను కదిలించకుండా ఒకవేళ కదిలించినచో దుర్వాసన రాకుండా రసాయన స్పే చేసిన తర్వాతనే కదిలించగలరని కోరుతూ ఈ 5,6 రోజులు దేవి నవరాత్రుల పూజలు అలాగే మహిళలు బతుకమ్మ ఆడుకుంటారు కనుక డంపింగ్ యార్డులో కుళ్ళిపోయిన పాత చెత్త ను కదిలించ వద్దని సింగపాగ జంగయ్య మాదిగ డిమాండ్ చేశారు