యువత మేలుకో..జాబ్ పట్టుకో..
నర్సింహులపేట పోలీస్ ల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కు రెండు బస్సులు..
సికె న్యూస్ ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాం నాథ్ కేకన్ ఐపీఎస్, గారి ఆధ్వర్యంలో రేపు జిల్లా కేంద్రంలోని ఎబి ఫంక్షన్ హాల్ లో నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళా కు వెళ్ళే నర్సింహులపేట మండల నిరుద్యోగ యువతీ,యువకుల ప్రయాణం కోసం రెండు బస్సులను ఏర్పాటు చేసినట్టు ఎస్ఐ సురేష్ పేర్కొన్నారు..
👉🏻 బయోడేటా ను స్కాన్ చేయనప్పటికి నిరుద్యోగ యువత సంబంధిత సర్టిఫికెట్స్ నేరుగా తెచ్చిన కూడా ఈ మెగా జాబ్ లో పాల్గొనవచ్చు…
👉🏻 జాబ్ మేళా లో పాల్గొనే యువతి యువకులకు మహబూబాబాద్ లో అక్కడే బోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు..
👉🏻 జాబ్ మేళా కు సంబంధించిన పూర్తి వివరాలకు పోలీస్ స్టేషన్ లో రేపు ఉదయం 7 గంటల వరకు సంప్రదించాలని ఆయన కోరారు..
👉🏻 బస్సులు 8 గంటలకు నర్సింహుల పేట పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరనున్నట్టు ఎస్ ఐ తెలిపారు..