కానిస్టేబుల్ భూక్యా సాగర్ ఆత్మహత్యాయత్నం కు కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి* ….
భారతీయ గోర్ బంజారా పోరాట సమితి డిమాండ్.
ఖమ్మం జిల్లా:-13-10-2024
ఏన్కూరు మండల కేంద్రానికి చెందిన భూక్యా సాగర్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది పోలీస్ అధికారులు తనను గంజాయి కేసులో ఇరికించారని, అవమానాల గురి చేశారని మనస్థాపానికి గురై పురుగుమందు సేవించి ఆత్మహత్య ప్రయత్నించాడు, హైదరాబాద్ లో ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం పొందుతున్నాడు, గ్యారెంటీ చెప్పలేము అని వైద్యులు చెబుతున్నారని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
ఆత్మహత్యకు కారకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి…, గోర్ బంజారా పోరాట సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ చౌహాన్
ఏన్కూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ భూక్యా సాగర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పటానికి కారకులపై ప్రభుత్వం వెంటనే పోలీసు ఉన్నంత అధికారులతో సమగ్ర విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సాగర్ కు నాణ్యమైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ చౌహాన్ గారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారులు సరైన పద్ధతిలో స్పందించకపోతే ఆందోళన చేపడుతామని వారు తెలిపారు. సాగర్ కు ఏమైనా జరిగితే వాంగ్మూలం లో ప్రకటించిన పేర్లు వారే బాధ్యత వహించాలని తెలిపారు.