నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఒక ధళ సభ్యుడి లొంగుబాటు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అక్టోబర్ 19,
తెలంగాణ రాష్ట్ర నిషేధిత మావోయిస్టు పార్టీ చర్ల ఏరియాకు చెందిన ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు మరియు ఒక ధళ సభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు.
లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యుల వివరములు
- పొడియం మంగు,( దేవేందర్), తండ్రి. ఇడుమ, 26 సంవత్సరాలు, ఏ సి ఎం, నివాసం: తుమ్రల్ గ్రామం, పామేడు పిఎస్, బీజాపూర్ జిల్లా, చత్తీస్గడ్ ర్రాష్ట్రం.
- మడివి అడిమే( అనూష), తండ్రి . లేట్ మంగ, 23 సంవత్సరాలు, ఏ సి ఎం, నివాసం: కొరకట్ పాడు గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- కుడం సోమల్, తండ్రి . అయితయ్య, 22 సంవత్సరాలు, దళ సభ్యుడు, నివాసం: గొల్లగుప్ప గ్రామం, ఎటపాక పి.ఎస్, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్..
ఈ ముగ్గురు 2018-19 సంవత్సరంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ లో బి కే – ఏ ఎస్ ఆర్ డివిజన్లోని చర్ల ప్లటూన్లో సాయుధ దళ సభ్యులుగా చేరినారు.
అనంతరం పొడియం మంగు, మడివి అడిమే ఇద్దరూ ఏరియా కమిటీ సభ్యులుగా ప్రమోషన్ పొందినారు. ఇప్పటి వరకు వీరు ముగ్గురు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ చర్ల ప్లటూన్లో పనిచేయడం జరిగింది. వీరి ఒక్కొక్కరి పై నాలుగు లక్షల రివార్డు కలదు.
జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన “ఆపరేషన్ చేయూత” ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమంలో హాజరయిన కుటుంబ సభ్యులు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని వీరు లొంగిపోయారు.
ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పై ప్రజలలో ఆదరణ లేకపోవడం వల్ల, ఈ సిద్ధాంతాలు విజయం సాధించలేవనే నిర్ణయానికి వచ్చి, ప్రశాంత జీవనం గడపాలని నిర్ణయించుకొని అనేక మంది మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యులు పోలీసు వారి సమక్షంలో లొంగిపోవడం జరుగుతుంది.
ఇతర రాష్ట్రాల నుండి జీవనం సాగించడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేయడానికి వచ్చే యువతీ యువకులను, వారి కుటుంబ సభ్యులను మావోయిస్టు పార్టీ నాయకులు బెదిరింపులకు గురిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించు కుంటున్నారు.
వారికి సహకరించని తమ పార్టీ సభ్యులను కూడా పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో అతి కిరాతకంగా హత్యలు చేస్తూ, వారి కుటుంబాల ను నాశనం చేస్తున్నారు. వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల వివక్ష, వేదింపులు తాళలేక వీరు ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ, స్వయంగా గానీ తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లేదా జిల్లా ఉన్న తాధికారుల వద్ద గానీ సంప్రదించగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. లొంగిపోయే దళ సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతి ఫలాలను అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుంది అని తెలిపారు.