అధికార పార్టీ నాయకుల అండదండలతో దొడ్డిదారిలో ఇసుక చేజిక్కించుకున్న ఓ గుత్తేదారు…
- ఎలాంటి పత్రిక ప్రకటన లేకుండా పాట నిర్వహించకుండా ఇసుకను చేజిక్కించుకున్న గంట్ల రమేష్
- వెంటనే వారి ఆర్డర్ ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని అందజేసిన సొసైటీ సభ్యులు..
సి కె న్యూస్, పినపాక నియోజకవర్గం అక్టోబర్ 23,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధిలోని చినరావిగూడెం సమ్మక్క సారక్క సొసైటీ కి కేటాయించిన 2,40,000 క్యూబిక్ మీటర్లు ఇసుకను ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా అమ్మకాలు జరపగా మిగిలిన ఇసుకను ఎలాంటి పత్రిక ప్రకటన లేకుండా దొడ్డి దారిన గంట్ల రమేష్ స్టాక్ యార్డ్ లో ఉన్న ఇసుకకు అనుమతులు తెచ్చుకున్నారు. ఇసుకను గిరిజనేతరుడికి అడ్డదారిలో దారా దత్తం చేశారని సంబంధిత గిరిజన మహిళలు ఆరోపణలు చేశారు.
ఈ అక్రమ అనుమతిని రద్దు చేసి, మా గిరిజన సొసైటీకి న్యాయం చేయాలని, మహిళలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ… మండలంలో నేను ఏది చెబితే అదే అని మీ సొసైటీ రద్దు చేపిస్తానని బెదిరించిన ఆ గిరిజనేతరుడి పై ఎస్సీ, ఎస్టీ అట్రసిటి కేసు నమోదు చేయాలని అంటూ చినరావిగూడెం గ్రామానికి చెందిన సమ్మక్క, సారలమ్మ ట్రైబల్ శాండ్ క్వారి లేబర్ కాంట్రాక్టు మ్యుచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ మహిళలు గిరిజన సొసైటీ మహిళలను ఆదుకోవాలని తహసిల్దార్ ను అభ్యర్థించారు. డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.