కిచిడీ తిని 12 మంది విద్యార్థులకు అస్వస్థత..
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏకంగా 60 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రిపాలైయ్యారు. వారం రోజులుగా చికిత్స తీసుకుంటున్న పదిమంది విద్యార్థుల పరిస్థితి ఇప్పటికి మెరుగుపడటం లేదు.ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.
ఈ ఘటన జరిగిన మూడవరోజు ముగ్గురు విద్యార్థులకు పరిస్థితి విషమించడంతో ఇద్దరినీ హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా మరో నలుగురి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు.
తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉదయం అల్పాహారంగా కిచిడీ తిన్న విద్యార్థుల్లో 12 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
గుర్తించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పరీక్షించిన వైద్యులు కలుషిత ఆహారం కారణంగానే అస్వస్థతకు గురైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థులకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
60 మందికి పైగా బాలికలు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలుకాగా తల్లిదండ్రులు భయందోళనకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన శైలజ, జ్యోతిలక్ష్మి, మహాలక్ష్మి, జ్యోతి, లావణ్యను ముందుగా మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఆధునిక వైద్యం అందించడం ప్రారంభించారు.
జ్యోతి, మహాలక్ష్మిని నిమ్స్‌కు తరలించారు. ఆ తర్వాత శైలజ ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం 16 మంది విద్యార్థినులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శైలజను ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచినట్లు తల్లిదండ్రులు ‘సాక్షి’కి వెల్లడించారు. స్పృహలోకి కూడా వచ్చిందని వైద్యులు చెప్పారని వారు తెలిపారు. ఇక మహాలక్ష్మి పూర్తిగా కోలుకోగా నేడు డిశ్చార్జి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వెల్లడికాని ల్యాబ్ రిపోర్టుల ఫలితాలు
పదుల సంఖ్యలో విద్యార్థినులు అనారోగ్యం బారినపడి ప్రాణాల మీదకు వచ్చినా.. అందుకు గల కారణాలు మాత్రం అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ రోజు వాడిన వంట పదార్థాలను ల్యాబ్‌కు తరలించారు. ఆరు రోజు లైనా ఫలితాలు బయటికి రాలేదు.
విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠి నచర్యలు తీసుకోవాలని ఓవైపు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తుండగా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాగునీటి పరీక్షల్లో ఎలాంటి కలుషిత సంకేతాలు రాలేదని మాత్రం అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతోపాటు మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
మంచిర్యాల నుంచి నిమ్స్‌కు శైలజ తరలింపు, వెంటిలేటర్‌పై కొనసాగుతున్న చికిత్స. నిలకడగా జ్యోతి, మహాలక్ష్మి ఆరోగ్యం. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 16 మంది బాలికలు. విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా.
వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలి కల ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. అస్వస్థతకు గురైన ముగ్గురికి హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నామన్నారు. పది మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందించి డిశ్చార్జి చేయనున్నామని తెలిపారు.
ఆస్పత్రిలో చేరిన విద్యార్థినులకు వైద్యం, వారి తల్లిదండ్రులకు ఆహారం ఖర్చులు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ చెల్లిస్తుందని పేర్కొన్నారు. బాలికల ఆరో గ్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఐటీడీఏ, జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు.
ఇప్పటివరకు రూ.7లక్షల వరకు ఖర్చు చేశామని, అత్యుత్త మ చికిత్స, సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తాగునీరు, ఆహార నమూనాలు పరీక్షలకు పంపించగా.. తాగునీటిలో ఎలాంటి కలుషి త సంకేతాలు లేవని, ఆహారానికి సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు.