ఖబర్దార్!!… రేవంత్ రెడ్డి!!
అర్ధరాత్రి అరెస్టు చేసిన లంబాడి రైతులను వెంటనే విడుదల చేయాలి!!
లంబాడి జాతి పై కక్ష కట్టిన రేవంత్ రెడ్డి !!
లంబాడి జాతిని ఎవ్వరు అణిచివేయలేరు!!
తగిన సమయంలో బుద్ధి చెప్తాం!!_
ఫార్మా కంపెనీల పేరుతో లంబాడి భూములను బలవంతంగా లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం !
లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు : భరత్ చౌహన్
వికారాబాద్ జిల్లా,కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలం లగచర్ల , రోటి బండ తండా , పులిచెర్లకుంట తండా, గడ్డమీది తండా, మైసమ్మ గడ్డ తండా, ఈదుల కుంట తండా, హకీంపేట, పోలేపల్లి, ఈదులపల్లి తదితర గ్రామాల రైతుల భూములను ఫార్మా కంపెనీల పేరుతో లాక్కునేందుకు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్, కాడ అధికారి, స్థానిక తహసీల్దార్ లతో జరిగిన సమావేశంలో అధికారులపై జరిగిన దాడి పట్ల లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ విచారం వ్యక్తం చేస్తుంది .
దాడికి గల కారణాలు పూర్వాపరాలను పరిశీలిస్తే, లంబాడి గిరిజన రైతులు గతంలో అనేకసార్లు మా భూములు తీసుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని స్థానిక అధికారులను కోరడం జరిగింది. భూములు మాకే కావాలి, మా భూములు లాక్కోవద్దు, అని ఎన్నిసార్లు ప్రాధేయపడిన గానీ డ్రోన్ కెమెరాలతో సర్వేలు చేయిస్తూ, వేరే గ్రామాల ప్రజలను తీసుకొచ్చి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ముగించుకుని మా లంబాడీల భూములను లాక్కోవాలనే ప్రయత్నం చేస్తే …నిరు పెద రైతులు అగ్రహించి అధికారులపై తమ నిరసనను దాడుల ద్వారా తెలిపారూ.
ఈ దాడి కి కారణం ప్రభుత్వ వైఫల్యమే అని అంబాడీ హక్కుల పోరాట సమితి భావిస్తున్నది. ఈ దాడికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించి లంబాడి రైతులను కాపాడి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడి తండాల పై దాడులు చేయించి వారి భూములను రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లో ఫార్మా కంపెనీలకు ధార దత్తం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నది. మా భూములు ఎవరికి ఇవ్వము మేము ఈ భూములను నమ్ముకొని తరతరాలుగా జీవిస్తున్నాము, ఎకరా అర ఎకరా భూములే మాకు జీవన ఆధారము అని ఎంత చెప్పినా పట్టించుకోకపోవడం లేదు. ప్రజా అభిప్రాయం పేరుతో ఫార్మా కంపెనీల కోసం లంబాడీల భూములు గుంజుకొని లంబాడీలను రోడ్డున పడేస్తారా?
పచ్చని పొలాలల పై దాడులు చేస్తారా?
మా భూములు మాకే కావాలి, మా భూములు ఫార్మ కంపెనీలకు ఇవ్వం ,ఈ ఫార్మా కంపెనీలు మాకు వద్దు, అని అన్న రైతులను అర్థరాత్రి అరెస్టులు చేస్తారా?
ఇదేనా ప్రజా సంక్షేమ పాలన ?
ఇదేనా రైతు సంక్షేమ పాలన ?
లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ప్రశ్నిస్తుంది ?
ఫార్మా కంపెనీ పేరిట అత్యంత విలువైన ఖరీదైన లంబాడీల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.. ఇట్టి ప్రయత్నాన్ని మానుకోకపోతే ప్రజాగ్రహం చూడాల్సి ఉంటుందని లంబాడి హక్కుల పోరాట సమితి హెచ్చరిస్తున్నది!