వాస్విక్ ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా ప్లేట్లు, గ్లాసులు పంపిణీ
సికె న్యూస్ ప్రతినిధి దానవాయిగూడెం : వాస్విక్ ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా నెహ్రూ జయంతి రోజున బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని దానవాయిగూడెం లో అంగన్వాడీ పిల్లలకి ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేసిన తిగుళ్ల వెంకటరమణ దంపతులు
ఖమ్మం నగరం స్థానిక దానవాయిగూడెంలో నెహ్రూ జయంతి రోజున వాస్విక్ ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దానవాయిగూడెం గ్రామానికి చెందిన తెగుళ్ల వెంకటరమణ దంపతులు చేతుల మీదుగా అంగనవాడి పిల్లలకి ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు
తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వాస్విక్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు దానిలో భాగంగా వాస్విక్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్ని ఖమ్మం జిల్లాకి విస్తరింప చేయాలనేటువంటి ఆలోచనతోటి వాస్విక్ ఫౌండేషన్ అధినేత నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి పిలుపుమేరకు అంగన్వాడి పిల్లలకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడమే కాకుండా పెద్ద తండా సమీపంలోని మెఫీ మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానం సైతం నిర్వహించారు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో సేవాభావంతో ఉండి మానవత్వంతో ముందుకు సాగాలని తద్వారా మంచి సమాజాన్ని ముందుకు తీసుకురావచ్చని తెలియజేశారు
వాస్విక్ ఫౌండేషన్ కి ఖమ్మం జిల్లా బాధ్యులుగా మరియు ఖమ్మం జిల్లా గౌరవ సలహాదారులుగా ఉన్న తాను. వయసులో చిన్నవాడైనా నిడిగుండ నరేష్ కుమార్ ప్రజాపతి చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితుడనే సేవాభావంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెగుళ్ళ వెంకటరమణ దంపతులతో పాటు స్థానిక కార్పొరేటర్ రవి రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ చందు, గ్రామస్తులు, మహిళలు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు వాస్విక్ ఫౌండేషన్ సంస్థ అభిమానులు రాధాకృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ దునుకు వేలాద్రి వెంకటేశ్వర్లు మెఫీ మానసిక వికలాంగుల కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన తెగుళ్ళ వెంకటరమణ గారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలియజేశారు
చిన్నపిల్లలకి క్లాసులు ప్లేట్లు పంపిణీ చేసి తన సేవా శివ భావాన్ని చాటుకున్న తెగుళ్ల వెంకటరమణ మరియు వారి దంపతులకు వాసవి ఫౌండేషన్ అధినేత నిలిగుండ నరేష్ కుమార్ కి వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డికి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ పట్టపోతుల రాణి సామిరెడ్డి లింగారెడ్డి, దామర్ల రవి, నాగటి బిక్షం, అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు ఆయా హారిక, నాగమణి, ఆదినారాయణ వేలాద్రి, రాము తదితరులు పాల్గొన్నారు