నేడు వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి!
వరంగల్ జిల్లా : ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది, ఇవాళ ఇందిరాగాంధీ జయంతి నేపథ్యంలో సభా వేదికకు ఇందిరా మహిళా శక్తి పేరు పెట్టారు..
వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవా సభలో పాల్గొననున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఇవాళ మధ్యాహ్నం 2:30 కు ముఖ్యమంత్రి హన్మకొండ కూడా గ్రౌండ్స్ హెలిపాడ్‌కు చేరుకుంటారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొని ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేదికకు చేరుకుంటారు.
మధ్నాహ్నం 3:20కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి.. మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య సభ్యులతో ముఖాముఖి మాట్లాడుతారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్య మంత్రి అక్కడే శంకుస్థాపన చెయ్యనున్నారు..
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, భీమా చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం వేదికపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.సాయత్రం 5.10 హెలికా ప్టర్ లో హైదారాబాద్ కి తిరిగి వెళతారు.
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. సీఎం రానున్న నేపథ్యంలో వరంగల్ లో పోలీలసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా అడుగడుగున పోలీసులు మోహరించారు. సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని ప్రయాణికులు వేరే మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. పోలీసులకు ప్రయాణికులు సహకరించాలని సూచించారు.