కల్తీ ఆహార పదార్దాల పైన అదనపు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు…
” ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి..”
” ఏజెన్సీ ప్రాంతాన్ని పట్టి పీడిస్తూ ఉన్న కల్తీ ఆహార పదార్ధాలు.”
“నాణ్యమైన ఆహార పదార్ధాలు పొందడం వినియోగదారుడి ప్రాధమిక హక్క.”
“ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..”
“పోడు రైతులకు బ్యాంక్ రుణాలు ఇప్పించాలి..”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా అధికారుల దృష్టికి కల్తీ ఆహార పదార్ధాల విషవలయం లో ఏజెన్సీ ప్రాంత ప్రజలు నేడు చిక్కుకొని అనారోగ్యం పాలవుతున్నారని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ఆరోపించారు. ఇదే విషయం పైన బుధవారం ములుగు జిల్లా రెవిన్యూ అదనపు జిల్లా కలెక్టర్ మహేందర్ జీ ని తన కార్యాలయం లో కలిసి ఫిర్యాదు చేశారు.
అదేవిదంగా పోడు రైతులకు బ్యాంక్ అధికారులు పంట రుణాలు ఇవ్వడం లేదని, రుణాలు ఇవ్వాలి అంటే కలెక్టర్ సంతకం కావాలని అంటున్నారని జిల్లా అదనపు కలెక్టర్ కి వివరించారు. కల్తీ ఆహారపదార్ధాలను కొంతమంది వ్యాపారులు కిరాణా షాప్ ల్లో ప్రజలకు విక్రయిస్తూ ఉన్నట్లు తెలిపారు .
నాణ్యమైన ఆహార పదార్ధాలు పొందడం వినియోగదారుల చట్ట బద్ధమైన హక్కు అన్నారు. బి గ్రేడ్, సి గ్రేడ్ వంటి నాసిరకం ఆహార పదార్దాలను డబ్బులు కోసం కక్కుర్తి పడి ప్రజల ఆరోగ్యాన్ని విషవలయం లోకి నేడుతూ ఉన్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు మాత్రం కరువయ్యాయి అని ఫిర్యాదు లో పేర్కొన్నట్లు తెలిపారు .
మారుమూల ఏజెన్సీ ప్రాంతం కావడం తో ఆహార పదార్దాలను పెద్దమత్తం లో కల్తీ చేస్తున్నారని కలెక్టర్ కి వివరించామన్నారు . ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అమ్ముకుంటున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు .మామూళ్ల మత్తులో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరినామని తెలపడం జరిగింది .
కల్తీ ఆహార పదార్దాల నిషేధిత చట్టం 1954 సెక్షన్ 2 ( ఎ) ప్రకారం.. కల్తీ అనగా.. ఆహార పదార్ధా లు సహజ సిద్ధమైన నాణ్యత లేకుండా తయారు చేయడం, లేదా దాని నాణ్య తకు హాని కలిగించే బయటి పదార్థాలను కలపడం, తక్కువ నాణ్యత గల వస్తువులను అధిక నాణ్యత గల వస్తువులుగా ప్రదర్శించడం, ఆ వస్తువులలో వినియోగదారులకు హాని కలిగించే హానికారక రసాయనాలను మిళితం చేయడం వంటి అర్ధం వస్తుందని అని కలెక్టర్ కి తెలిపినట్లు తెలియజేసారు . అదనపు జిల్లా కలెక్టర్ మహేందర్ జీ స్పందిస్తూ బ్యాంక్ అధికారులతో మాట్లాడి రుణాలు ఇవ్వాలని ఆదేశిస్తామని అన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల పైన చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు.
అనంతరం నర్సింహా మూర్తి మాట్లాడుతూ వినియోగదారుడే రారాజు అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రచా రానికి భిన్నంగా వినియోగదారుడు తనకు అవసరమైన వస్తువులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేకుండా చేసే మార్కెటింగ్ మాయలో పడేసి కల్తీ పదార్థాల విషకౌగిలిలో చిక్కి విల విల్లాడే పరిస్థితులను సృష్టిస్తుండడం బాధాకరం అన్నారు.
వినియోగదారుల హక్కుల పరి రక్షణ కోసం కోప్రా లాంటి ప్రత్యేక చట్టాలతో పాటు వారి రక్షణ కవసరమైన జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగాన్ని రూపొందించినా ఆశించిన స్థాయిలో కల్తీ కోరల్లో నుంచి వినియోగదారు లను కాపాడలేక పోవడం దురదృష్టకరం అన్నారు . నిజానికి అఖిల భారత స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ( FSSAI) 2006 లో స్థాపించబడింది అని తెలిపారు .
కల్తీని కను క్కొని అరికట్టడం కోసం డిటెక్ట్ అడల్టరేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్ పేరుతో వినియోగదారులే నేరుగా ఆహార పదార్థాలలో కల్తీని కనుక్కోవడానికి అవసరమైన సూచనలతో కూడిన ప్రక్రియను కరదీపీకలను వినియోగ దారులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు పంచాలని అన్నారు. కల్తీ ఆహార పదార్దాలను ఎలా గుర్తించలానేది వినియోగ దారులకు అవగాహన కల్పించడం లేదన్నారు.
ప్రజలు వాడే నిత్యావసర సరుకులు అయిన ఉప్పు, పప్పు,పాలు పంచదార, నూనె వంటి ప్రతి ఆహార పదార్థం నాణ్యత కోల్పోయి, కల్తీ గురి అవుతున్నట్లు తెలిపారు. వినియోగ దారుల హక్కుల పరిరక్షణ కొరకు ప్రజలతో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలి. కల్తీ పట్ల ఏ మాత్రం ఏమరపాటు గా ఉన్నట్లయితే అనారోగ్యాన్ని కిరాణా షాపుల్లో కొని తెచ్చుకున్నట్లే అని ప్రజలకు సూచించారు.
వినియోగ దారుల ఫోరం ఏర్పాటు చేసుకొని ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలన్నారు. హోటల్స్, బేకరీల్లో విపరీతంగా కల్తీ జరుగుతున్నట్లు తెలిపారు.
ప్రతినెలా ప్రజల కష్టాన్ని జీతాలుగా పొందే ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని అమ్ముకోకుండా విస్తృత తనిఖీలు చేయాలని కోరినారు.
కల్తీకి పాల్పడితే ఎంతటి వారినైనా వారి షాప్ సీజ్ చేసి వినియోగదారుల చట్టం క్రింద శిక్షలు విధించాలని అన్నారు . వినియోగ దారుల ఆరోగ్య భద్రత పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని, మండల స్థాయిలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించాలని అన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లా స్థాయిలో ఎక్కడో ఉండడం కారణంగా దీని పైన పర్యవేక్షణ, నియంత్రణ ఉండడం లేదన్నారు. దేశంలో జరుగుతున్న కుంబకోణం ల కంటే అతి పెద్ద కుంభ కోణం కల్తీ ఆహార పదార్దాల కొంబకోణం అన్నారు.కల్తీకి అడ్డుకట్ట వేయకపోతే ప్రజల ప్రాణాలకు భద్రత ఉండదన్నారు.
కల్తీ ఆహార పదార్ధాలు తిని క్యాన్సర్ వంటి ప్రాణంతక వ్యాధులకు గురి అవుతున్నారని అన్నారు.దీన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అరికట్టాలని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోలేని ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు ఎలా అవుతాయాని ప్రశ్నించారు.
రోగాల భారిన పడి చనిపోయిన కోళ్లను, మేకలను కోసి వాటి మాంసాన్ని అధిక ధరలకు విక్రయించి ప్రజల ప్రాణాలను అపాయం లోకి నేడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మారుమూల ఏజెన్సీ మండలాలను తరుచూ తనిఖీలు చేసి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు.