పెబ్బేరు గోదామును తగలబెట్టిన దోషుల సంగతేంటి..?
ప్రమాదం జరిగి 7 నెలలైనా నేరస్తులను పట్టుకోని పోలీసులు…
గన్నీ బ్యాగులను మాయం చేసేందుకే ఆగ్ని ప్రమాదం డ్రామా…
పెద్దనేత వంచన చేరితే దోషులను పట్టుకోరా…?
పెబ్బేరు పోలీసుల తీరుపై డిజిపికి ఫిర్యాదు చేస్తాం…
బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
పెబ్బేరు నవంబర్20 (సి కే న్యూస్)
పెబ్బేరు మార్కెట్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి 7 నెలలు గడిచినా నేటికీ నేరస్థులను ఇంకా పట్టుకోలేదని.. దోషులను ఎప్పుడు పట్టుకుని శిక్షిస్తారని బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అధికారులను ప్రశ్నించారు.అగ్ని ప్రమాదానికి గురైన పెబ్బేరు మార్కెట్ యార్డు గోదామును, కాలిపోయిన సంచులను ఆయన బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారిక లెక్కల ప్రకారం గోదాంలో 12.94 లక్షల గన్నీ బ్యాగులు నిల్వ చేయగా అగ్ని ప్రమాదంలో అవి కాలి పోయాయని, వాటి విలువ దాదాపు రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని అన్నారు.
అదేవిధంగా 3 గోదాములు సైతం ఎందుకూ పనికి రాకుండా పోయాయని వాటి నిర్మాణానికి సైతం రూ.10 కోట్లు ఖర్చవుతుందని, వీటన్నింటికీ బాధ్యులెవరని, ఎందుకు వారిని శిక్షించడం లేదన్నారు.అధికారులను ప్రమాద ఘటన వివరాలు అడిగితే తమకు తెలియదని బుకాయిస్తున్నారని, గోదాంలో కరెంట్ కనెక్షన్ లేనందున షాట్ సర్క్యూట్ అవ్వటానికి కూడా వీలులేదన్నారు.
ఇన్స్యూరెన్స్ ఉందని దానికి క్లెయిమ్ పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు కానీ అందులో 7 లక్షల మేర గన్నీ బ్యాగులు మాయం చేసేందుకే అగ్ని ప్రమాదం జరిగిందన్న సమాచారం తమకు ఉందన్నారు.ఘటనకు 3 రోజులు ముందు డిఎస్ఓ సెలవుపై ఎందుకెళ్లారని, ఈ కేసు పోలీసులకు అప్పగించినా ఎందుకు ఇంత కాలం కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
గతంలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటేనే అరెస్టులు చేసిన పెబ్బేరు పోలీసులు…దోషులెవరో తమకు తెలిసినా ఇన్ని రోజులుగా ఎందుకు మూగబోయారని అన్నారు.ఇప్పటికైనా ఈ ఘటనకు కారుకులెవరో తేల్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి, సంబంధిత మంత్రికి,రాష్ట్ర డీజీపీలను కలిసి వారికి సమస్యను విన్నవిస్తానని అన్నారు.కార్యక్రమంలో బిసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటన్న గౌడ్, నాయకులు, సితార వెంకటేశ్వర్లు, రాఘవేందర్, యాదగిరి, రమేష్, మ్యాదరి రాజు, నాగరాజు, పరుషరాముడు తదితరులు పాల్గొన్నారు.