ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్
అమ్మో భూకంపం ఇవి ప్రకృతి హెచ్చరికలే నా.?
ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్-
తెలంగాణ రాష్ట్ర పలు జిల్లాలలో భూకంపం నమూనాలతో భూమి బుధవారం ఉదయం 7:01 నుంచి కొద్ది సెకండ్ల పాటు భూమి దద్దరిల్లింది, ఎన్నోసార్లు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సంకేతాలు పలుమార్లు అక్కడక్కడ సంభవించినప్పటికీ బొగ్గు గనుల ప్రభావం వల్లే ఇలా అయి ఉండవచ్చని అధికారులు.
ప్రజలను మభ్యపెడుతూ ఇలాంటి సంకేతాలకు ప్రజలు భయపడాల్సిన పనిలేదు అని ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని. పత్రికా ముఖంగా పలు మార్లు వెల్లడించడం జరిగింది.
కానీ ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలను చూస్తుంటే’ ప్రకృతి హెచ్చరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది అనే భవనతో ప్రజలు ఆయా ప్రాంతాలలో భయభ్రాంతికి గురవుతున్నారు.
దీనికి నిలువెత్తు నిదర్శనమే’ ఎన్నడూ లేని విధంగా ఇటీవల మేడారం దండకారణ్యంలో జరిగినటువంటి ప్రకృతి విధ్వంసమే నిలువెత్తు నిదర్శనం..
ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇలా జరిగిందా లేక ఈ సంఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకుందా అనే విషయం తెలియాల్సి ఉంది..
కూసుమంచి మండలంలో నాలుగు ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి
భూకంపం వస్తుందేమోనని భయాందోళనకు గురైన మండల ప్రజలు
కూసుమంచి:
కూసుమంచి మండలంలో ఉదయం 7:25 సమయంలో 4 సెకండ్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఆకస్మాత్తుగా ఉన్నట్లుండి ఇండ్లన్నీ షేక్ అవడంతో ఇండ్లలోని పాత్రలు సైతం షైకై శబ్దాలు వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పలు గ్రామాల ప్రజలు చర్చించుకున్నారు.
ఒకసారి గా భూమి నాలుగు సెకండ్ల పాటు కంపించడంతో భూకంపం వస్తుందేమోనని ప్రజలు తమ ఇండ్ల వద్ద నుండి బయటకు పరుగులు తీశారు.