జలగలంచ బస్ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతే ఆ బాధ్యత ఎవరిది అక్క?
“చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏముంది.”
“ప్రజల ప్రాణాల పట్ల అశ్రద్ధ వహిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం.”
“మీడియా కథనాలను పెడచెవిన పెట్టినందునే ఈ ప్రమాదం.”
“జలగలంచ వంతెన ప్రమాదాలను సికే న్యూస్ ముందే పసిగట్టిన”
“మీడియా కథనానికి జిల్లా ఉన్నతాధికారి స్పందన మాత్రం శూన్యం “
“ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా పస్రా-తాడ్వాయి మధ్యలో గల జలగలంచ వంతెన ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న పట్టించుకోని అధికార యంత్రాంగం, గత నెలలో జలగలంచ వంతెన ప్రాంగణంలో ఒక ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇచ్చే క్రమంలో వంతెన ఇరుకుగా ఉండడంతో ఒక మధ్యతరగతి కుటుంబ జీవన ఉపాధికి ఆర్థికంగా ఉపయోగపడుతూ తన సొంత లారీ ములుగు జిల్లా లో ప్రమాద శాత్తు కోల్పోవడంతో కుటుంబ బతుకు జట్కా బండి రోడ్డున పడే”.
జలగలంచ అంతేనా ప్రమాదంలో రోడ్డున పడ్డ దుస్థితి మన ములుగు జిల్లాలో నెలకొంది… జలగలంచ వంతెన ఘటనను ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న సికే న్యూస్ బృందం జరిగిన విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి బాధితుల ఆవేదనతో ప్రచురింపజేసిన ఫలితం లేకపాయే.!
ప్రభుత్వ అశ్రద్ధకు నిలువెత్తు నిదర్శనంగా బుధవారం ఉదయం మరో ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు -లారీ ఎదురెదురుగా డి కొట్టుకోవడంతో ఎటువంటి ప్రాణనష్టం లేకుండా.! ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు…
ఘటన జరిగిన తర్వాత స్పందించే బదులు ఘటనకు ముందే ప్రమాదకరంగా ఉన్న జలగలంచ వంతెన విషయంలో అధికార యంత్రాంగం మెలకువగా ఉంటే ఇలాంటి తప్పిదాలు ప్రమాద భయాందోళన పరిస్థితులు ములుగు జిల్లాలో ఉండవని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు..
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క వారి బృందానికి సకాలంలో ఆదేశాలు జారీ చేయగా.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు క్షతగాత్రులను పరామర్శించి వారికి మెరుగైన చికిత్స చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ కోరారు..
తీవ్రంగా గాయపడ్డ వారిని ఎంజీఎం కి తరలించి ఎంజీఎం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స చేయాలని వైద్యులను ఆదేశించిన మంత్రి సీతక్క. ఈ ఘటనలో పార్టీ
క్షతగాత్రుల సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు..