నియోజక వర్గ అభివృద్దే నా ద్వేయం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్యాధునిక పద్ధతుల్లో హుజుర్ నగర్ బస్ స్టాండ్ నిర్మాణం చేపడుతాం
మంత్రి పొన్నం ప్రభాకర్
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య డిసెంబర్ 06
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా హుజుర్ నగర్ బస్ స్టాండ్ ను తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతినిత్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రులు విచ్చేసి మాట్లాడుతూ
40ఏండ్ల క్రితం కట్టిన బస్ స్టాండ్ ను పునర్నిర్మాణం చేస్తామని
అదనపు ప్లట్ పామ్, షాపింగ్ కాంప్లెక్స్, బస్ స్టాండ్ ముందు పెట్రోల్ బంక్ నిర్మాణాలను చేపడుతామని
హుజుర్ నగర్ బస్ స్టాండ్ కు రోజుకు 170 బస్సులు వస్తున్నాయి
మరిన్ని బస్సు సౌకర్యాలు పెంచేలా ప్రణాళికలు చేస్తాం
ఉచిత బస్ తో 60లక్షల మంది ప్రయాణం చేస్తుంటే వాటిలో మహిళలే 36లక్షల మంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు
ఏడాది పాలనలో మహాలక్ష్మి పధకం ప్రారంభించిన నాటి నుండి కోటి, 16లక్షల మంది మహిళలు ప్రయాణం చేశారు.రూ.4వేల కోట్లు విడుదల చేసింది
భవిష్యత్ లో 116కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసిన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశాం
10ఏండ్లలో ఒక్క కొత్త బస్సు లేదు
కాంగ్రెస్ అధికారం వచ్చాక ఆర్టీసీ బస్సు లాభాల బాటలో పయనిస్తోంది.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించం
త్వరలోనే బస్ స్టాండ్ నిర్మాణా పనులను ప్రారంభిస్తాం
బస్సుల రాకపోకలు ఇబ్బందులు లేకుండా 50ఏండ్ల వరకు ఇబ్బందులు లేకుండా అధునాతన పద్ధతులతో బస్ స్టాండ్ నిర్మాణం చేస్తామని అన్నారు.