తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బిఅర్ అంబేద్కర్ కు నివాళులు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 06
మఠంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కాటిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రధాన కూడలిలో ఉన్న ఆ మహానీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావూరి విజయభాస్కర్ మాదిగ రాష్ట్ర ఉపాధ్యక్షులు విచ్చేసి మాట్లాడుతూ ఈ దేశంలో ప్రజలు స్వేచ్ఛగా సమానత్వంగా జీవించాలని రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని సదుద్దేశంతో ఆయన ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచిస్తే నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మానవ హక్కులకు విగాథం కల్పిస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని సామాన్య ప్రజలు ఏమి తినాలో ఏమి తినకూడదు అని ఆంక్షలు పెట్టి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు.
ఈ దేశంలో అన్ని మతాల అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో జీవించాలని అంబేద్కర్ గారు కోరుకుంటే ఈనాటి కేంద్ర ప్రభుత్వం మతోన్మాద దుష్టశక్తులు ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
మండల అధ్యక్షులు మల్లేష్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంను దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాలు ఒకే తాటిపైకి వచ్చి రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు .
ఇట్టి కార్యక్రమంలో ,బిజెపి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఆరాల సైదులు, కాంపాటి సందీప్ మాదిగ కొమ్ము ఇమాన్యుల్ మాదిగ ఆరాల నాగరాజు మట్టయ్య వీరస్వామి ఆరాల అంజి పల్లె పంగూ రాధాకృష్ణ వస్కుల జయరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు