జగిత్యాలలో మిస్సైన మైనర్ బాలిక ఆచూకి లభ్యం
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక శుక్రవారం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆమె ఆచూకి లభ్యమైంది.
నిజామాబాద్లో పోలీసులు ఆమెను గుర్తించారు. బాలిక కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెట్పల్లి పట్టణంలోని విజ్డమ్ హైస్కూల్ హాస్టల్లో ఇబ్రహీంపట్నంకు చెందిన బాలిక 10వ తరగతి చదువుతోంది. గురువారం మధ్యాహ్నం భోజన సమయంలో స్నేహితులని కలిసి వస్తానని తన తోటి విద్యార్థులు చెప్పి వెళ్లిపోయింది.
అర్ధరాత్రి దాటినా కూడా ఆమె మళ్లీ హాస్టల్కు తిరిగిరాలేదు. దీంతో స్కూల్ యాజమాన్యం.. బాలిక కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వాళ్లు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల పలు కీలక విషయాలు చెప్పారు.
గత కొంతకాలంగా పదవ తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని స్కూల్ యాజమాన్యం ఒత్తిడిచ చేస్తున్నారని ఆరోపించారు. స్కూల్ యజమాని రామారావును కూడా బాలిక కుటుంబ సభ్యులు నిలదీశారు.
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. పోలీసులు చొరవ తీసుకొని బాలికను అప్పగించాలంటూ వేడుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పలుచోట్ల సీసీకెమెరాలు పరిశీలించారు.
హాస్టల్ భవనంతో పాటు గదులు కూడా పర్యవేక్షించారు. చివరికి శుక్రవారం రాత్రి నిజామాబాద్లో ఆమె ఆచూకీ లభ్యం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆమె ఎందుకు వెళ్లిపోయిందన్న విషయంపై స్పష్టత రాలేదు.