రైతే రాజు అన్న ఈ ప్రభుత్వంలో రైతు గోడు వినేవాడే కరువు
“రహదారుల పట్ల ప్రభుత్వ నిర్ణయం సరైనదే’ కానీ ప్రస్తుతం రైతుల సౌకర్యం అవసరం.”
“దుమ్ము ధూళి విషయంలో జిపి అధికారులు శ్రద్ధ వహించి అనారోగ్య సమస్యకు చెక్ పెట్టాలి.”
“రోడ్ల మీద దుమ్ము తో శ్వాస కోశవ్యాధులు సంభవిస్తున్నాయి.”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గల జాతీయ రహదారుల విషయమై రైతుల గోడును పట్టించుకోని సంబంధిత అధికారులు , మరియు అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, వామపక్ష నాయకులు…కొండాపురం గ్రామం సమీపంలో గ్రామ పరిధిలో ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని ప్రజలు వాపోయారు.
గ్రామం మధ్యలో రోడ్డు రిపేర్ వర్క్ పూర్తి చేయకపోవడంతో రోడ్డు పైన వాహనాలు తిరగడం వలన దుమ్ము, దూళి, మిర్చి అలుముకోవడం వలన పంట నష్టం కలుగుతుంది లక్షల లక్షలు పురుగుమందులు పెట్టుబడి పెట్టి రైతు నష్టపోతున్నారని రైతులు ఆవేదం వ్యక్తం చేసినారు.
రోడ్డు కాంట్రాక్టు అధికారులకు రైతుల ఆవేదనను ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు రోడ్డు వాటరింగ్ చేయకపోవడంపై రైతులు కొండాపురం వద్ద రైతులు ధర్నాకి దిగారు.. గ్రామం లోని ఇళ్లలో కీ దుమ్ము ధూళి వచ్చి ప్రజలు తీవ్రంగా అనారోగ్యం పాలు అవుతున్నారని ప్రజలు తెలిపారు…
ప్రధాన రహదారిపై చిప్స్ మెటల్ పోసి వదిలేసారని రైతు లు అన్నారు…ప్రధానంగా గ్రామంలో రోడ్డు పక్కన అంగన్వాడి పాఠశాల, ప్రాథమిక పాఠశాల,ఉన్నందువలన వాహనాలురోడ్ల పై తిరగడంతో పాఠశాలలో దుమ్ము, ధూళి వెళ్లి విద్యార్థులు శ్వాసకోస వ్యాధులతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ప్రజలు తెలిపారు.
దుమ్ము, దూళి కారణంగా కళ్ళు ఎర్రబడటం, చర్మ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తులు పాడవడం వంటి వ్యాధులు వస్తున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు రోడ్డు పనులు పూర్తిచేయాలని కోరారు.
ప్రధాన రహదారిపై రోడ్డు వేసే వరకైనా వాటర్ ట్యాంక్ తో రోడ్డు తడపాలని సంబంధిత అధికారులను కోరారు. సంఘటన స్థలానికి వెంకటాపురం మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ఐ మల్లయ్య చేరుకొని రైతులకు సమస్యపై పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాని విరమించుకున్నారు….