‘రైతు భరోసా’ పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతోన్న ‘రైతు భరోసా’ పథకంలో భాగంగా ఏ ఒక్క రైతును తగ్గించే ఆలోచన తమకు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీలో వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో పెద్ద రైతులకు కూడా రైతుబంధు ఇస్తున్నారంటూ దుష్ప్రచారం శారని, తెలంగాణలో 10 ఎకరాలు కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్లు 1.39 శాతం మాత్రమే ఉన్నారని కేటీఆర్ (KTR) సభలో వెల్లడించారు.
అదేవిధంగా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్లు 7 శాతం మాత్రమే ఉన్నారని, 5 ఎకరాలలోపు ఉన్న రైతులు 91.33 శాతం మంది ఉన్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రారంభించబోయే ‘రైతు భరోసా’ పథకంలో రైతులకు కోత పెట్టే కార్యక్రమం మంచిది కాదని కేటీఆర్ (KTR) సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మంత్రి తుమ్మల, కేటీఆర్కు సమాధానమిస్తూ.. ‘రైతు భరోసా’ విధివిధానాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
అందరి సూచనల తరువాతే విధివిధానాలను ఖరారు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా ఏ ఒక్క రైతును కూడా తగ్గించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.