గూడాలలో గుడుంబా బీభత్సం
“20 రూపాయల కోసం ఏమైనా అమ్మేస్తాం. చోరీ బాబుల తీరు”
“నీళ్లు పట్టే బిందైనా..! నీళ్లు వచ్చే మోటరేనా..! మత్తు ఇచ్చేది ఏదైనా మాకు ఒక్కటే”
“ములుగు జిల్లాలో చోట చోరీల చేతివాటం”
“సంబంధిత శాఖ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.? అంత జగమెరిగిన సత్యమే.!”
“ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లాలోని పలు ప్రాంతాలలో గుడుంబా బీభత్సం, ధర తక్కువలో ఎక్కువ మత్తు ఇచ్చే గుడుంబాకి మద్యం ప్రియులు బాగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వాడవాడకు గ్రామ వీధుల్లో గుడుంబా విక్రయ దుకాణాలు పెరిగిపోయాయి.
గుడుంబా సరఫరా అధికమవుతున్నందున అందించలేని గుడుంబా తయారీ స్థావరా సభ్యులు. మద్యానికి అమాయక ప్రజలు మోగ్గు చూపే విధంగా, అక్రమ సంపాదనకు అడ్డంగా అలవాటు పడ్డ సారా తయారీ గాళ్లు, సారా లో మత్తును పెంచేందుకు ప్రభుత్వ దవఖానాలో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లను సేకరించి. హీటర్ సహాయంతో తక్కువ సమయంలో కిక్ తో సారాను తయారు చేస్తున్నారు.
ఈ క్రమంలో వృద్ధులు, యువత ఆ మద్యాన్ని తాగి అనేక అంతుచిక్కని ఆకస్మిక వ్యాధులకు గురవుతున్నారు. మత్తులో కుటుంబ బాధ్యతలు కూడా గుర్తు లేకుండా మందుబాబులు ఇంట్లో ప్రవర్తించే తీరుపై, ఎన్నో కుటుంబ కలహాలకు దారితీస్తున్నాయి.
అంతేకాకుండా ధర తక్కువ అవడంతో సారా తాగి మత్తులో “కూలి పని” మానేసి సారా పైసలు కోసం పలు రకాల చోరీ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదే విషయమై ఇటీవల వెంకటాపురం మండల కేంద్రంలోని రక్షకబట నిలయంలో నిత్యవసర వాడుక వస్తువులు గూర్చి అనగా..!
ఇంటిముందు ఆరు బయట ఉంటున్నటువంటి. బిందెలు, బకెట్లు, వాడుకలో లేని ఇనుప సామాన్లు, ఫోర్ వీలర్ అత్యవసర అధిక టైర్లులతోపటు కంచాలు, మంచాలు, కూడా వదిలి పెట్టట్లేదు. మండలంలో ఇలా అనేక రకాల ఎన్నో కేసులు నమోదవుతున్నాయి.
ఇదే విషయమై సంబంధిత శాఖ పట్టించుకోకపోయినా. మండల అధికారులైన పోలీసులు కొంచెం చొరవ తీసుకొని. గుడుంబా పావురాలపై పలుమార్లు దాడికి దిగిన, గుడుంబా ఆగడాలు మాత్రం ఆగడం లేదు” సంబంధిత శాఖ ఇకనైనా వారి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలంటూ మహిళా సంఘాలు, మహిళలు వాపోయారు.