HyderabadPoliticalTelangana

మరో బీఆర్ఎస్ నేత అరెస్ట్…

మరో బీఆర్ఎస్ నేత అరెస్ట్…

మరో బీఆర్ఎస్ నేత అరెస్ట్…

స్టేట్ పాలిటిక్స్‌ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, రాష్ట్ర తొలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్ అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ లోని వెస్ట్ మారేడ్‌పల్లి లో ఎర్రోళ్ల ఇంటికి వెళ్లిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఆయనను అదుపులోకి మాసబ్ ట్యాంక్ పీఎస్‌కు తీసుకున్నారు.

కాగా, బంజారాహిల్స్ లో ఇటీవలే కేసు నమోదైంది. అదేవిధంగా ఇదే వ్యవహారంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా, ఎర్రోళ్లను అరెస్ట్ చేస్తున్నారనే సమాచారం జరగడంతో ఆయన ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

ఈ కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తలుపులు తెరవకపోవడం, బీఆర్ఎస్‌ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అంటూ ట్వీట్ చేశారు.

బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని చెప్పారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.

సెలవు రోజుల్లో కావాలని తమ నేతలను అరెస్ట్ చేస్తూ, సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు తాము భయపడబోమని అన్నారు. తెలంగాణ సమాజమే వారికి తగిన బుద్ధి చెబుతుందని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button