KhammamPoliticalTelangana

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు శ్లాఘనీయం.. మాజీ MLA డాక్టర్ బాణోత్ చంద్రావతి..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు శ్లాఘనీయం.. మాజీ MLA డాక్టర్ బాణోత్ చంద్రావతి..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు శ్లాఘనీయం.. మాజీ MLA డాక్టర్ బాణోత్ చంద్రావతి..

ఖమ్మం. డిసెంబర్..27.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి తీరని లోటు అని. మన్మోహన్ సింగ్ మన దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయమని మాజీ MLA డాక్టర్ బానోత్ చoద్రావతి అన్నారు.

వివిధ హోదాల్లో దేశానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.దేశం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయిందని అమె అన్నారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26వ తేదీన పంజాబ్ లో జన్మించారు.. అనారోగ్యంతో బాధపడుతూ 2024 డిసెంబర్ 26వ తేదీన మృతి చెందారని అన్నారు.

2004 – 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా పనిచేశారని, 1991 అక్టోబర్ నుంచి 2019 జూన్ వరకు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యునిగా, 2019 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ వరకు రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారని తెలిపారు.

భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర వహించారని పేర్కొన్నారు..దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎక్స mla డాక్టర్ బానోత్ చంద్రావతి అన్నారు.

ఆర్థిక వేత్తగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేశారు. ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.

నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయంలోనే నెరవేరిందని అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేశారని ఆమె గుర్తు చేశారు.. 2008లో చారిత్రాత్మకమైన భారతదేశం – అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు.

దేశంలో పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. అధికారులు గుట్టుగా ఉంచే సమాచారాన్ని సామాన్యులు సైతం పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని 2005లో తీసుకు వచ్చింది కూడా మన్మోహన్ సింగే అని చెప్పారు.

ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ హయంలో ఆధార్ పథకం ప్రారంభించారని తెలిపారు. ఆయనకు మాజీ MLA డాక్టర్ బాణోత్ చంద్రావతి ఘన నివాళులు అర్పించారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button