Uncategorized

అల్లు అర్జున్ కేసులో మరో కీలక మలుపు.

అల్లు అర్జున్ కేసులో మరో కీలక మలుపు.

అల్లు అర్జున్ కేసులో మరో కీలక మలుపు.. కీలక ఆదేశాలు జారీ చేసిన NHRC

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు కీలక మలుపు తిరిగింది. సంధ్య థియేటర్ దగ్గర లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ చర్యలకు ఆదేశించింది.

లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన సందర్భంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్ను NHRC ఆదేశించింది.

డిసెంబర్ 4, 2024న పుష్ప-2 ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించారు. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్ లో కూడా పుష్ప-2 ప్రీమియర్ షో పడింది. ఈ షోను అభిమానులతో కలిసి వీక్షించేందుకు నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వెళ్లాడు. అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు ఒక్కసారి అతనిని చూసేందుకు ఎగబడ్డారు.

పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ, ఆమె కొడుకు శ్రీతేజ్ అభిమానుల కాళ్ల కింద పడి నలిగిపోయారు. ఈ ఇద్దరికీ పోలీసులు వెంటనే సీపీఆర్ చేశారు. రేవతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. రేవతి కొడుకు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అల్లు అర్జున్ తీరుపై, థియేటర్ యాజమాన్యంపై, పోలీసుల వైఫల్యంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంపై మానవ హక్కుల సంఘం మండిపడింది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంతో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది.

అల్లు అర్జున్ అరెస్ట్ అయిన మరుసటి రోజే బెయిల్పై విడుదలైనప్పటికీ టాలీవుడ్ ప్రముఖుల ‘ఓదార్పు యాత్ర’ కారణంగా అల్లు అర్జున్పై, తెలుగు సినీ పరిశ్రమపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మృత్యువుతో పోరాడుతూ ఆ పిల్లాడు ఆసుపత్రిలో ఉంటే, ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, అండగా నిలవాల్సింది పోయి అల్లు అర్జున్ను పరామర్శించడంపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడం, ఆ తదనంతర పరిణామాలు, టాలీవుడ్ ప్రముఖులు సీఎంతో భేటీ కావడం ఇవన్నీ మన కళ్ల ముందు జరిగిన పరిణామాలే. NHRC ఆదేశాలతో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మరోమారు వార్తల్లో నిలిచింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button