పలమనేరు విద్యార్థికి గోల్డ్ మెడల్
పలమనేరు, జనవరి7 ck న్యూస్
పలమనేర్ దండపల్లి విద్యార్థికి గోల్డ్ మెడల్
వివరాలు ఇలా ఉన్నాయి
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం దండపల్లి గ్రామానికి విద్యార్థిని సి పుష్పలత కు ప్రొఫెసర్ పిఎన్ దామోదరం ఎండోమెంట్ మెమోరియల్ అవార్డు జె ఎన్ టి యు అనంతపురం ఎంటెక్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో టాపర్గా వచ్చిన సి పుష్పలతకు గోల్డ్ మెడల్ ప్రధానం చేయడం జరిగింది.
వ్యవసాయదారిత కుటుంబమైన సి పుష్పలత చిన్నప్పటి నుంచి చదువులో ఉన్నతంగా రాణిస్తూ ఉండేది ఆమె ప్రతిభను గుర్తించి ఉన్నత చదువులకై తాము కష్టించి కూలి పనులు చేసి అమ్మాయిని చదివించామని చెప్పారు
పుష్పలతను ఈరోజు గోల్డ్ మెడల్ తో స్టేజ్పై చూడడం మాకు పట్టలేని సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పుష్పలత తల్లిదండ్రులు సి కొండయ్య లక్ష్మీదేవి తెలియజేశారు.
తమ గ్రామ అమ్మాయికి ఈ విధంగా అవార్డు రావడం మాకందరికీ సంతోషంగా ఉందని ఈ సందర్భంగా గ్రామస్తులు కూడా తెలియజేశారు.