విధుల పట్ల నిర్లక్ష్యం…..స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్…
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) నవంబర్ 25
ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు బీబీనగర్ మండలం వెంకిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ జి.గాయత్రిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణ రెడ్డి నేడు ఉత్తర్వులు జారీ చేశారు.
శనివారం నాడు రాయగిరి లోని విద్యా జ్యోతి హైస్కూలులో జరుగుతున్న రెండవ విడుత ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ శిక్షణా కార్యక్రమానికి ఉదయం 9.00 గంటలకు హాజరు కావలసివుండగా ఆమె 2 గంటలు ఆలస్యంగా శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారని,
జిల్లా విద్యాశాఖ అధికారి ఆలస్యానికి కారణములు అడిగితే అల్ప కారణాలు తెలుపుతూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇవ్వడం జరిగిందని, ఆమె ఎన్నికల విధుల పట్ల బాధ్యతగా లేదని అట్టి ఉత్తర్వులలో పేర్కొంటూ సివిల్ సర్వీసెస్
రూల్స్ 1991 ప్రకారం నిబంధన 8 లోని సబ్ రూల్ (1) ప్రకారం ఆమెను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.సస్పెన్షన్ కాలములో ముందు అనుమతి లేకుండా ఆమె హెడ్ మాస్టర్స్ దాటి వెళ్లరాదని అట్టి ఉత్తర్వులలో పేర్కొన్నారు.