PoliticalTelangana

మద్యం దుకాణం వద్దని.. కలెక్టరేట్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నం

మద్యం దుకాణం వద్దని.. కలెక్టరేట్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నం

మద్యం దుకాణం వద్దని.. కలెక్టరేట్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ ఏడాది నూతనంగా కరీంనగర్‌ గాంధీ రోడ్డు(44వ డివిజన్‌)లో మద్యం దుకాణం మంజూరైంది.

అక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దంటూ సమీప డివిజన్‌వాసులు డిసెంబరు 11న ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

అయినా తొలగించకపోవడంతో పలువురు డివిజన్‌వాసులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడంతో పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం బయటకు వచ్చిన అశోక్‌ అనే వ్యక్తి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నారు. పక్కన ఉన్న స్థానికులు బాటిల్‌ లాక్కొన్నారు.

విషయం తెలుసుకున్న ఒకటో ఠాణా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యాయత్నం చేసిన అశోక్‌ను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button