తెలంగాణ శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం
ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల శ్రీ చైతన్య పాఠశాలలోని విద్యార్థులు ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా రంగవల్లులు తీర్చిదిద్ది గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ చిన్నారులు పాటలు పాడుతూ నాట్యం చేశారు. హరిదాసు వేషంలో ఉన్న చిన్నారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. మరొక పక్క భోగి మంటలు కూడా వేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పివిఆర్ మురళీమోహన్ గారు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తెలుగు వారి పండుగని ఈ పండుగ ఆంగ్ల సంవత్సరంలో మొదటి నెలలో వస్తుందని, హరిదాసుల పాటలు, డూడూ బసవన్నల ఆటలు ఆనందపరుస్తాయని, కొత్త ధాన్యం ఇంట చేరి రైతులు ఆనంద పడతారని, ఆర్థికంగా బలపడుతూ సంవత్సరమంతా మంచి జరగాలని కోరుకుంటారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ గారు, డైరెక్టర్ శ్రీమతి శ్రీవిద్య గారు, పాఠశాల ప్రిన్సిపాల్ పివిఆర్ మురళీమోహన్ గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి నివేదిత గారు, ప్రైమరీ ఇన్ చార్జెస్ రమాదేవి, ఆశాదేవి అలాగే ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ ఉమాదేవి గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.