మేం అల్లాటప్పాగా అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదు..
మేడ్చల్ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్.. సికె న్యూస్ ప్రతినిధి మేడ్చల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో… గత పదేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను వేగంగా పరిష్కరించి.. అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నాం. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలుతదని కొందరు మాట్లాడుతున్నరు.. మేం అల్లాటప్పాగా అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదు.. ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నాడా…? …
మేడ్చల్ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్..
సికె న్యూస్ ప్రతినిధి మేడ్చల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో… గత పదేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను వేగంగా పరిష్కరించి.. అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నాం.
ఆరు నెలల్లో ప్రభుత్వం కూలుతదని కొందరు మాట్లాడుతున్నరు..
మేం అల్లాటప్పాగా అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదు..
ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నాడా…?
మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే.. ఫామ్ హౌస్ గోడలే కాదు.. ఇటుకలు కూడా మిగలవు
రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మీ కడుపు కాలుతుందా… కళ్లు మండుతున్నాయా?
ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇస్తలేరని కవిత మాట్లాడుతుంది.
మేం భర్తీ చేసిన 30వేల ఉద్యోగాల్లో 43శాతం ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాం.
లెక్కలతో సహా.. పేర్లతో సహా చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..
చేతనైతే మీ అయ్యను అసెంబ్లీకి పంపించు.. లెక్కలు చెబుతాం
ధర్నా చౌక్ వద్దన్న వాళ్లు ఇవాళ సిగ్గులేకుండా వెళ్లి ధర్నా చౌక్ లో ధర్నా చేస్తుండ్రు.
మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపొతే అయ్యను అడగని వాళ్లు కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారు..
లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయింది..
హరీష్ రావు మేడిగడ్డకు రమ్మంటే రాడు.. అసెంబ్లీలో మైక్ ఇస్తే మాట్లాడడు.
పదేళ్లలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యను కూడా తీర్చలేకపోయారు.
మేడ్చల్ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు రావాలి.. భూములవిలువలు పెరగాలి..
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా..
400 సీట్లు వస్తాయంటున్న మోదీ రాష్ట్రాల్లో పార్టీలతో ఎందుకు పొత్తులు పెట్టుకుంటుండు?
ఎన్డీయేను అతుకుల బొంతగా ఎందుకు మారుస్తుండు..
మోదీ పాలనకు ఇక కాలం చెల్లింది.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది..
ఎన్నడు ఈ ప్రాంతానికి రాని ఈటెల ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?
ఈటెలను హుజూరాబాద్ లో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడికి వచ్చి ఎలా గెలుస్తాననుకుంటున్నాడు?
మెట్రో మేడ్చల్ కు రావాలన్నా.. ఐటీ పరిశ్రమలు రావాలన్నా… మల్కాజిగిరి పార్లమెంటులో కాంగ్రెస్ గెలవాలి.
కాంగ్రెస్ గెలుపుతోనే మల్కాజిగిరి పార్లమెంట్ అభివృద్ధి చెందుతుంది.